కోర్టులో కేసు నడిచినా సరే... | Telanagana new secretariat foundation stone date.

Telanagana new secretariat foundation stone date fixed

Telangana new secretariat, new secretariat foundation stone, KCR new secretariat, November 14 Telangana new secretariat, KCR new secretariat, High Court on new secretariat

Muhurtham for Telangana new secretariat foundation stone.

కేసీఆర్ సార్ మొండిగ పోతుండు...

Posted: 11/04/2016 01:51 PM IST
Telanagana new secretariat foundation stone date fixed

తాను చేయాలనుకున్న పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొండిగా ముందుకు వెళ్లటం తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు స్టైల్. అంశంపై వివాదాలు, ఆరోపణలు, వాదనలు ఎలా ఉన్నా సరే ఆయనదే ఫైనల్ డెసిషన్. ఆఖరికి బంతి కోర్టులో ఉన్నాసరే దానిని అనుకూలంగా మార్చుకునే దిశగా ఆయన చేసే ప్రయత్నాలు దాదాపు సఫలీకృతమే అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణ నిర్ణయం కూడా అందులోకి చేరిపోబోతుంది.

సచివాలయం తరలింపు, కొత్త భవనాల నిర్మాణంలో ముందుకే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నా సరే ప్రస్తుత సచివాలయం భద్రతాపరంగా, సౌకర్యాల పరంగా బాగా లేదని భావిస్తున్న సర్కార్.. ఈనెల 14న కార్తీక సోమవారం కావటంతో కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయాలన్న ఆలోచన చేస్తోంది. ఆ రోజు మంచి ముహూర్తం కావడంతో ముందు శంకుస్థాపన చేసి.. కోర్టులో కేసులు తేలాక ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది.

సచివాలయం తరలింపును హైకోర్టు కూడా వ్యతిరేకించక పోవడంతో ఈ లోగా తరలింపు కోసం పూర్తి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో సచివాలయంలోని ఏ, బీ, సీ బ్లాకులను, ఆ తర్వాత డీ బ్లాకును కూలగొట్టనున్నారు. ఆలోగా ఏపీ సచివాలయం ఆధీనంలోని భవనాలు కూడా చేతికి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. నూతన సచివాలయ నిర్మాణంతో పాటు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ త‌న కొత్త క్యాంపు అఫీస్ ప‌క్కనే ఉన్నాతాధికారుల‌కు క్యాంపు ఆఫీస్ లు నిర్మించాల‌ని యోచిస్తున్నారు.

సీఎంకి ఎప్పుడు అందుబాటులో ఉండేలా ఈ క్యార్టర్స్‌ను నిర్మాణాలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. పేషీ అధికారులతో పాటు స్పీక‌ర్, మండ‌లి ఛైర్మన్, సీఎస్, డీజీపీ వంటి ఉన్నతాధికారులు త‌నకు అందుబాటులో ఉండే విధంగా... వారి నివాస గృహ సముదాలాయు ఉండాలని యోచిస్తున్నారు.

సిఎం క్యాంపు ఆఫీస్ ప‌క్కనే పంజ‌ాగుట్టలో ఉన్నతాధికారులకు క్వార్టర్స్ నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎంవో సెక్రటరీలు, స్పీక‌ర్, మండలి ఛైర్మన్.. మొత్తం 15 మంది అధికారుల‌కు అత్యాధునిక హంగుల‌తో నివాస సముదాయాలు నిర్మించనున్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. క్వార్టర్స్ నిర్మాణంపై చర్చించారు. క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాకుండా.. జిల్లా కేంద్రాల్లోనూ అధికారులకు ఆఫీసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే కోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తున్న క్రమంలోనే మరోవైపు శంకుస్థాపన జరిపించటం ఆసక్తికరంగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.380 కోట్లతో విశాలమైన సచివాలయం రూపుదిద్దుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  New secretariat  KCR  new muhurtham  

Other Articles