రాత్రి దెబ్బలు తిన్నారు.. పగలు ప్రతీకారం తీర్చుకున్నారు.. UP boy set ablaze for saving his sister from molesters

Up boy set ablaze for saving his sister from molesters

Suraj Kashyap, burns, assailants, UP boy set ablaze, minor sister molesters, boy set ablaze,boy saves sister,​up boy, kerosene attack, shahjahanpur, eve teasing, molestation, crime

A 17-year-old boy who attempted to save his younger sister from being molested was allegedly set on fire by the assailants

రాత్రి దెబ్బలు తిన్నారు.. పగలు ప్రతీకారం తీర్చుకున్నారు..

Posted: 09/25/2016 10:37 AM IST
Up boy set ablaze for saving his sister from molesters

తన సోదరిని పోకిరీల భారి నుంచి కాపాడిన సోదరుడు.. అదే పోకిరీల చేతిలో సజీవంగా దహనమై.. జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని షహజన్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తన సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించిన జులాయిలను అడ్డుకున్నాడని ఓ పదిహేడేళ్ల యువకుడిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పటించారు. ప్రస్తుతం అతడు 50శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. షహజాన్ పూర్ లోని సౌఫ్రీ గ్రామానికి చెందిన సూరజ్ కశ్యప్ అనే యువకుడు, అతని సోదరి వున్న ఇంటి ఎదురుగా కొంతమంది తాగుబోతు యువకులు కూర్చోని ఫుల్లుగా మద్యం సేవించారు.

ఇది గమనించిన సూరజ్ కశ్యప్.. అడ్డగోలిగా అసభ్యంగా మాట్లాడుతుండటంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో వాళ్లు ఇంట్లోకి చొరబడి తన సోదరిని వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆ నలుగురితో యువకుడు పోరాడగా చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారిని తరిమికొట్టారు. ఇది మనసులో పెట్టుకున్న వారు అతడు ఒంటరిగా బయటకు వెళుతుండం చూసి కాపుకాసి దాడి చేశారు. బాగా కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suraj Kashyap  burns  assailants  kerosene attack  shahjahanpur  eve teasing  molestation  crime  

Other Articles