ప్రత్యేక హోదాకు మంగళం.. అర్థికసాయంపై క్లారిటీ ఇవ్వని కేంద్రం.. Arun Jaitley Special Package announcement disappoints people of Andhra Pradesh

Arun jaitley special package announcement disappoints people of andhra pradesh

Andhra pradesh, Andhra pradesh special status, Andhra pradesh special package, chandrababu, chandrababu naid, andhra, arun jaitley, PM modi, suresh prabhu, ap, ap news, ysrcp, tdp, ys jaganmohan reddy, jana sena, pawan kalyan, opposition parties, congress, chandrababu news. india news

Andhra Pradesh would be given equivalent advantage through externally aided project. This equivalent advantage would be for a period of five years ie., 2020.

ప్రత్యేక హోదాకు మంగళం.. అర్థికసాయంపై క్లారిటీ ఇవ్వని కేంద్రం..

Posted: 09/07/2016 11:51 AM IST
Arun jaitley special package announcement disappoints people of andhra pradesh

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడింది. ఇక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్న కేంద్రం ఆర్థిక సాయం విషయంలోనూ క్లారిటీని ఇవ్వలేకపోయింది. గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడుతుందని భావించిన ఐదు కోట్ల అంద్రుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇక ఇవాళ ఉదయం నుంచి ప్యాకేజీ విషయంలో రేకెత్తిన్న ఉత్కంఠ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వుంది. కాగా ఏపీ ప్రత్యేక ప్యాకేజీలపై అన్ని వివరాలను తమ వెబ్ సైట్లో రేపు పొందుపరుస్తామని చెప్పడం.. పోలవరం ప్రాజెక్టుకు నూరు శాతం నిధుల్ని అందిస్తామని విషయాలే కొత్తగా వున్నాయి.

ఈ మేరకు ఇవాళ ఇప్పుడా.. అప్పుడా అంటూ ఉత్కంఠ రేపి చివరకు రాత్రి పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి అందించాల్సిన సహాయ, సహకారాలపై కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నామని..రాష్ట్ర విభజనతో అటు పారిశ్రామికంగా, ఇటు రెవెన్యూ పరంగా ఏపీ నష్టపోయిందన్నారు. నాలుగు అంశాలను పరిశీలించి ఏపీని ప్రత్యేక ఆర్థిక స్తాయిని కల్పించాలని భావించామన్నారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు, 14వ అర్థిక సంఘం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన, నీటి అయోగ్ సిఫార్సుల మేరకు ఏపీని అన్ని విధాలా అదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు.

ఈ తరుణంలో రాష్ట్ర పునర్విభజ చట్టంలోని అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని జైట్లీ తెలిపారు. అనేక విద్యా సంస్థలను ఇప్పటికే ప్రకటించామని జైట్లీ అన్నారు. కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయని జైట్లీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుందని జైట్లీ అన్నారు. 2014 అర్థిక సంవత్సరం ప్రారంభం (అనగా ఏప్రీల్ 1) నుంచి పోలవరం ప్రాజెక్టుకు...అయిన ఖర్చు కూడా కేంద్రమే చెల్లిస్తుందని జైట్లీ చెప్పారు. పోలవరానికి సంబంధించిన రెండు నాబార్డు ద్వారా రుణాన్ని అందించి ఆ తరువాత కేంద్రం ఆ రుణాలను తీర్చేవిధంగా యోచిస్తున్నామని చెప్పారు.

రెవెన్యూలోటుకు సంబంధించి 14వ ఫైనాన్స్‌ కమిషన్ ఆమోదించిందని జైట్లీ చెప్పారు. మొదటి రెండేళ్ల రెవెన్యూ లోటును ఇప్పటికే చెల్లించామన్నారు. ప్రత్యేక హోదా ఏ ప్రాంతాలకు వర్తిస్తుందన్న విషయంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్యాకేజీ ప్రకటన గురించి మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా అనేది కేవలం కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలకే వర్తించాలని 14వ ఫైనాన్స్‌ కమిషన్ చెప్పిందని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని నిశితంగా చర్చించామన్నారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్ నిబంధనల వల్ల సాధ్యపడలేదని అరుణ్ జైట్లీ చెప్పారు.

ప్రత్యేక హోదా కాకుండా దానికి సమానమైన ప్రయోజనాలు కల్పించే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని జైట్లీ చెప్పుకొచ్చారు. రైల్వేజోన్, నియోజకవర్గాల పునర్‌విభజన సహా అనేక అంశాలు పరిశీలనలో ఉన్నాయని జైట్లీ చెప్పారు. పన్ను మినహాయింపులకు సంబంధించిన నోటిఫికేషన్ కాసేపట్లో విడుదల చేస్తామని జైట్లీ అన్నారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అంశాలు తుది దశలో ఉన్నాయని జైట్లీ తెలిపారు. రెవెన్యూ లోటు, పన్ను మినహాయింపులకు సంబంధించిన తుది వివరాలను నీతి ఆయోగ్, ఏపీ ప్రభుత్వం చర్చించి నిర్ధారించుకుంటాయని జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2,500 ఇచ్చామని ఆరుణ్ జైట్లీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles