Son Dies on Father Shoulder After Being Denied Medical Facilities

Son dies on father s shoulder after being denied medical facilities

Son Dies on Father's Shoulder, UP father shoulder son, Denied Medical Facilities, medical felicities lack in UP, After Odisha now UP father carries son body, father carry son body, Kanpur father carry son body on shoulder

Son Dies on Fathers Shoulder After Being Denied Medical Facilities.

ITEMVIDEOS:కన్నతండ్రి భుజాలపై కన్నుమూశాడు

Posted: 08/30/2016 01:47 PM IST
Son dies on father s shoulder after being denied medical facilities

నలుగురిలో బతుకుతున్నామనే భ్రమే తప్ప, సాటివారికి సాయం చేయలేని మనుషులు ఉన్న సంఘం మనది. కొందరు ప్రజా సేవకుల ఈ విషయంలో ఓ ఆకు ఎక్కువే చదివారు. విపత్కర పరిస్థితుల్లో వారు స్పందించే తీరు ఎంత దారుణంగా ఉంటున్నాయో, వాటికి నిర్లక్ష్యం తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మధ్య వరుస ఉదంతాలు తెలుపుతున్నాయి. ఒడిషాలో మొన్న ఒక భర్త తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని కాలినడకన వెళ్లిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఇప్పుడు సరైన వైద్యం అందించకపోవటమే కాదు, నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఏకంగా ఓ పసిప్రాణం నేలరాలింది.

యాపీ లోని కాన్పూర్‌ లోని లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి సునీల్ కుమార్ అనే వ్యక్,తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు అంశ్ (12) ను తీసుకొచ్చాడు. స్థానిక ఆసుపత్రిలో చూపించగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారని, ఎమర్జెన్సీలో చేర్చి చికిత్స అందించాలని ఆయన లాలా లజపతిరాయ్ ఆసుపత్రి వైద్యులను కోరాడు. వైద్యులు కనీసం తనను పట్టించుకోలేదని, అక్కడి నుంచి పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పడానికి వారికి అరగంట పట్టిందని ఆయన ఆరోపించాడు. అక్కడి నుంచి పిల్లల ఆసుపత్రి దూరం కావడంతో పిల్లాడిని పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్తామని స్ట్రెచర్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, దీంతో తన కుమారుడిని భుజంపై అక్కడికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యంలో మృతిచెందాడని, దీంతో ఆ మృతదేహాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూనే ఇంటికి వెళ్లానని ఆయన రోదిస్తూ చెబుతున్నాడు.

రాజస్థాన్ లో కేర్లి గ్రామంలో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించేందుకు ఆంబులెన్స్ లేకపోవటంతో ఓ వివాహిత చనిపోగా, ఒడిషాలో రైలు కింద పడిపోయి రెండు ముక్కలయిన మహిళ శవాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించగా, వెదురు బొంగులకు కట్టి ఇద్దరు కూలీలతో మోయించిన రైల్వే పోలీసులు ట్రెయిన్ లో వేరే ఊరి ఆస్పత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం చేయించారు. ఆస్పత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు లేకపోవటం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపెడుతోంది. ఈ శోకాలు ప్రభుత్వాలకు వినిపిస్తున్నాయో లేదో మరీ? .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Father  Shoulder  son  died  

Other Articles