తెలంగాణ అసెంబ్లీలో జీఎస్టీ పై చర్చ | Telangana Assembly Sessions Begins on GST bill

Telangana assembly sessions begins on gst bill

KCR GST BIll, Telangana GST bill, Telangana 10th state on GST, GST Bill KCR, KCR on GST in Assembly, GST Bill in telangana assembly

Telangana Assembly Sessions Begins on GST bill.

ITEMVIDEOS:జీఎస్టీపై టీ అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ

Posted: 08/30/2016 11:50 AM IST
Telangana assembly sessions begins on gst bill

జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ శాసనసభ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో మంగళవారం బిల్లుపై చర్చ జరగనుంది. ముందుగా సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం కోసం రూపొందించిన బిల్లు... జీఎస్టీ అని ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

పన్నుల ఎగ‌వేతను త‌గ్గించ‌డానికే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింద‌ని వివ‌రించారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కావటంతో సగం రాష్ట్రాలు ఆమోదించాలని తెలిపారు. గవర్నర్ ఆదేశాలానుసారం బిల్లు కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశ పరిచామని, ఏకగ్రీవంగా ఆమోదించేందుకు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రాలు ఆమోదిస్తేనే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడుతుంది. ఆపై కౌన్సిల్ పన్ను విదానాన్ని రూపొందిస్తుందని వివరించారు.

 

యూపీఏ హ‌యాంనుంచి ఈ బిల్లును తీసుకురావాల‌ని చూశార‌ని, బిల్లుపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని ఆయ‌న అన్నారు. జాతీయ స్థాయిలో ఓ అవ‌గాహ‌నకొచ్చిన త‌రువాత జీఎస్‌టీ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో ఆమోదం పొందింద‌ని అన్నారు. పార్టీల‌కు అతీతంగా ఇప్ప‌టికే తొమ్మిది రాష్ట్రాలు దీనిని ఆమోదించాయని పేర్కొన్నారు. బిల్లుని ఆమోదించిన పదో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ ప‌న్ను విధానాన్ని 150కి పైగా దేశాలు అనుస‌రిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. దీని వ‌ల్ల దేశానికి లాభం చేకూరుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. పెద్దగా వ్యతిరేకత లేకపోవటంతో బిల్లు ఏకగ్రీవంగా పాసయ్యే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం మహారాష్ట్రతో ఒప్పందం వివరాలతోపాటు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రాధాన్యంపై వివరణ ఇవ్వనున్నారు. మంగళవారం ఒక్కరోజే సభ జరిగే అవకాశం ఉండగా, పదిహేను రోజులు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  assembly  GST bill  

Other Articles