Shah Rukh Khan detained third time at American airport

Shah rukh khan detained at los angeles airport

Shah Rukh Khan, Shah Rukh Khan Detained, Indian actor Detained, Los Angeles, Bollywood, America, Los Angeles Airport, us immigration department, mamata banerjee, bollywood

Bollywood Hero Shahrukh Khan was again "detained" at a US airport, the third time in seven years that he has been stopped by US immigration officials at the country's airports.

షారుఖ్ ఖాన్ ను విమానాశ్రయంలో నిర్భంధించిన అమెరికా

Posted: 08/12/2016 07:29 PM IST
Shah rukh khan detained at los angeles airport

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనలో భాగంగా ఐసీ బడే బడే దేశోంమే షోటీ షోటీ గల్లీ హోతే రహ్ తీ హై అని ఏ బాలీవుడ్ హీరో డైలాగ్ అయితే చెప్పాడో.. అదే బాలీవుడ్ హీరో, బాలీవుడ్ బాద్ షాగా పేరోందిన షారుక్ ఖాన్‌కు అగ్రరాజ్యం అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. మై నేమ్ ఇజ్ ఖాన్ బట్ ఐయామ్ నాట్ ఏ టెరరిస్టు అన్న ట్యాగ్ తో వచ్చిన చిత్రంలో హీరోగా కూడా నటించిన ఆయనను లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఆయనను అధికారులు నిర్బంధించారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడేళ్ల కాలంలో అగ్రరాజ్యం అధికారులు ఆయనను మూడు పర్యాయాలు విమానాశ్రయాల్లో నిర్భంధించారు.

అయితే దీనిపై స్పందించిన ఆయన ‘‘ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి భద్రతా ఏర్పాట్లు ఎంత ముఖ్యమో తనకు పూర్తిగా తెలుసునని, కానీ, ప్రతిసారీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం అంటే చిరాకు వేస్తుంద’’ అంటూ ఈ విషయాన్ని స్వయంగా షారుక్‌ ఖానే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే అదే సమయంలో కాలక్షేపం కోసం తాను ఏం చేశానో కూడా చెప్పారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనుమతి వచ్చేవరకు వేచి చూస్తూ మంచి పోకిమన్‌లను పట్టుకున్నానని అన్నారు.

షారుక్ ఖాన్‌ను అమెరికా విమానాశ్రయంలో అడ్డుకోవడం ఇది మొదటి సారి కాదు. 2012 ఏప్రిల్‌లో కూడా ఆయనను న్యూయార్క్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, కారణం ఏమీ లేకుండా రెండు మూడు గంటల పాటు విమానాశ్రయంలో ఆగిపోవడం భలే చిరాకు అని ఇంతకుముందు ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తన పిల్లలను మంచి యూనివర్సిటీలో చేర్చడం కోసమే తరచు అమెరికా వెళ్తున్నానని ఆయన వివరించారు. నిజానికి అంతకుముందే 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ (అయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్) అనే సినిమా కూడా షారుక్ హీరోగా వచ్చింది.

అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో షారుక్ ఖాన్ను నిర్బంధించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఈ విషయం తెలియగానే తాను షాకయ్యానని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని, అమానవీయమని అన్నారు. భద్రత ముఖ్యమని, అలాగని తనిఖీల పేరిట వేధించడం తగదని మమత ట్వీట్ చేశారు. అమెరికాలో యాలె యూనివర్శిటీని సందర్శించేందుకు వెళ్లిన షారుక్ను లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విచారణ పేరుతో దాదాపు రెండు గంటలు అదుపులో ఉంచుకుని తర్వాత వదిలిపెట్టారు. దీనిపై షారుక్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ షారుక్కు క్షమాపణలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Los Angeles  Bollywood  America  mamata banerjee  

Other Articles