Suspected Militant Nayeem killed in encounter with NIA

Gangster nayeem shot dead at shadnagar in encounter

Former naxalite nayeem killed in shadnagar, terrorist in millineum township, gangster Nayeem killed in mahaboobnagar, basha terrorist, gangster nayeem, former naxalite, suspect militant, shad nagar, mahaboobnagar, NIA, para military forces, Telangana

Former naxalite and gangster Nayeem was killed in a gunfight with the National Investigation Agency (NIA) in Shadnagar, 60 km from Hyderabad

నయీమ్ నేర చరిత్ర అత్యంత భయానకం..

Posted: 08/08/2016 11:31 AM IST
Gangster nayeem shot dead at shadnagar in encounter

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులకు కూడా సవాల్ విసిరిన గ్యాంగ్ స్టర్ నయామ్ మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గ్యాంగస్టర్ నయీమ్ హతమయ్యాడు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నేర చరిత్ర చాలా పెద్దదే. మావోయిస్టుగా తన నేర చరిత్రను ప్రారంభించిన నయీయ్, సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మావోయిస్టు నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లోనూ కీలక నిందితుడు.

భూదందాలు, సెటిల్ మెంట్లతో తనదైన శైలిలో కరుడుగట్టిన నేరగాడిగా మారిన నయీమ్ పై జాతీయ దర్యాప్తు బృందం సహా తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. నయీమ్ ముఖ్యఅనుఛరులు శ్రీను, సుధాకర్ లు గతంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిచ్చిన కీలక సమాచారంతో నయీమ్ పై నిఘా పెట్టారు. నయీమ్ మహాబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చేరకున్నాడన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకు తెల్లవారు జామునే షాద్ నగర్ లోని మిలీనియమ్ టౌన్ షిప్ లో స్థానికులను అప్రమత్తం చేశారు.

నయీమ్ నివసిస్తున్న ఇంటిని చుట్టుపక్కల వారిని చాకచక్యంగా అక్కడి నుంచి ఖాళీ చేయించిన పోలీసులు నయీమ్ అశ్రయం ఇచ్చిన బాషా ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అనుమానం కల్గిన నయీమ్ గన్ మెన్ పోలీసులను చూసి షాక్ అయ్యాడు. అంతే వారిపై కాల్పులు జరపడంతో.. రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బలగాలు షాద్ నగర్ లో నయీమ్ తో పాటు అతడి గన్ మెన్ ను కూడా తుదముట్టించాయి. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీమ్ పై 100కు పైగా కేసులున్నాయి.

భాయనకమైన నేర చరిత్ర కలిగిన నయామ్

రాడికల్ గ్రూప్ లో చేరి నక్సలైటు గా తన నేరచరిత్రను ప్రారంభించిన నయీమ్.. తాజాగా భూదందాలు, సెటిల్ మెంట్లలలో కీల‌కంగా వ్య‌వ‌హిరంచాడు. ఇతనికి అనేక హ‌త్య‌ కేసులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉంది. హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో జనవరి 27, 1993లో ఐపీఎస్ వ్యాస్‌ను కాల్చి చంపిన కేసులో న‌యీమే కీల‌క నిందితుడు. వ్యాస్ హత్య కేసులో నయీం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అక్కడి నుంచి నయామ్ కొంత సొంత ఇమేజ్ ను సంపాదించాడు. మావోయిస్టు కార్యకర్త, ప్ర‌జా గాయ‌కురాలు బెల్లి ల‌లిత హ‌త్య కేసులోనూ ఇత‌నే నిందితుడు. టీఆర్ ఎస్ నేతలు సాంబ‌శివుడు, రాములు హ‌త్య కేసులో కూడా న‌యీమ్‌ నిందితుడుగా ఉన్నాడు. సోహ్రాబుద్దీన్ ఎదురు కాల్పుల కేసులో నయీం కోసం సీబీఐ అధికారులు గాలింపు చేపట్టారు.

1989 క్రితం నయీం పీపుల్స్ వార్ లో చేరారు. న‌క్స‌లైట్‌గా నేర చ‌రిత్ర‌ను మొద‌లుపెట్టిన న‌యీమ్ ఆ త‌ర్వాత అనేక హ‌త్య‌ల్లో కీల‌క పాత్ర పోషించాడు. నక్సల్స్ జీవితం వదిలి పోలీసు కోవర్ట్ గా మారాడు. అనేక మంది నక్సల్స్ నాయకులనే హతమార్చాడు. నక్సల్స్ నుంచి పోలీసు కోవర్ట్ గా మారాడు. మాజీ న‌క్స‌లైట్ ప‌టోళ్ల గోవ‌ర్ధ‌న్ రెడ్డిని హ‌త్య చేసింది కూడా న‌యీముద్దినే. న‌యీమ్‌కు ప‌రోక్షంగా ముంబై గ్యాంగ్‌స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీంతోనూ లింకులు ఉన్నాయి. ఒక‌ప్పుడు గోవ‌ర్థ‌న్‌, అజిజ్ రెడ్డిలు గ్యాంగ్‌స్ట‌ర్‌లుగా హల్‌చ‌ల్ చేశారు. అయితే ఆ ఇద్ద‌రికీ న‌యీమ్‌తో సంబంధాలు ఉన్న కార‌ణంగా ముంబై డాన్‌ల‌తోనూ అత‌నికి లింకులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2001లో చివరిసారి నయీమ్ అరెస్టు అయ్యాడు. 11 సార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles