‘Ghost’ arrested for smearing woman’s front door with feces and urine for seven months

Ghost arrested for smearing woman s front door

man with ghost mask, man with white sheet, man with red shoe covers, man with long black wig, man threatening a woman, man threatens woman since seven months, Dali, Yunnan Province, southwest china, Ms. Yang, CCTVNews, China News, CCTV Footage, politics, ghost, Yunnan, accident, China, police

A man wearing a ghost mask, white sheet, red shoe covers, and a long black wig, was threatening a woman for the past seven months in Dali, in China’s southwest Yunnan Province.

ITEMVIDEOS: ఏడు నెలలుగా ‘ఆ’ పని చేసిన దెయ్యం అరెస్టు..

Posted: 08/06/2016 09:43 AM IST
Ghost arrested for smearing woman s front door

చైనాలో పోలీసులు నిజంగా సహసవంతులా..? వారు ఏకంగా దెయ్యాన్ని అరెస్టు చేసిన సంచలనం సృష్టించారా..? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఓ మహిళను గత ఏడు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న దెయ్యాన్ని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే దెయ్యాన్ని పట్టించింది మాత్రం సిసిటీవీ కెమెరానే. అదేలా అంటారా..? అసలు దెయ్యం మహిళను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెట్టింది. మహిళను ఎలాంటి ఇబ్బందులకు గురిచేసింది..?

వివరాల్లోకి వెళ్తే.. నైరుతి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ లో దాలి అనే పట్టనంలో నివసించే ఓ మహిళను దెయ్యం వేషంలో ఓ యువకుడి గత ఏడేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నాడు. అమ ఇంటి తలుపుపై లఘుశంక పోశాడు. పేడ కూడా వేసేవాడు. దీంతో తెల్లారి లేచి చూస్తే పూర్తిగా అపరిశుభ్రత కనిపించేది. దీంతో పాటు అక్కడ ఓ ఉత్తరాన్ని కూడా వదిలి వెళ్లేవాడు. అమె గతంలో ఓ కుటుంబానికి చెందిన విషయంలో కలగజేసుకుని ఓ వ్యక్తిని ఇబ్బందులు పెట్టిందని అందుకు క్షమాపణలు చెప్పాలని ఆ ఉత్తరంలో రాశాడు.

అయితే దీనిపై స్పందించిన బాధితురాలు తానను కావాలనే ఎవరో ఇలా కుట్రలతో ఇరికించారని, తానెలాంటి తప్పు చేయలేదని మహిళ అక్కడ ఉత్తరాన్ని పెట్టింది, అయితే మళ్లీ అలానే చేసిన దెయ్యం.. మరో ఉత్తరాన్ని పెట్టింది. మహిళ వల్ల బాధపడిన యువకుడిని ముఖాముఖిగా కలసి క్షమాపణ చెప్పాలని లేఖలో రాసింది. వేర్వేరు వేషాల్లో అనేక సార్లు దెయ్యం ఇలా చేసింది. చాలాసార్లు ఇలా జరగడంతో దెయ్యమేమో అని ఆ మహిళ భయపడింది.

దీంతో అనుమానాలు రేకెత్తిన మహిళ చివరకు పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే అమెకు అండగా స్థానికులు కూడా సహకరించారు. దీంతో తన ఇంటి తలుపు ప్రాంతం కనబడేలా ఓ సిసిటీవీ కెమెరాను అమర్చింది. దీంతో తనను గత ఏడు నెలలుగా వేధిస్తున్న దెయ్యం గుట్టు రట్టు అయ్యింది. సిసిటీవీ కెమెరాల్లో చిక్కిన దెయ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అతన్ని యాంగ్ అనే 42 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేసి కటకటాలవెనక్కు నెట్టారు. అయితే యాంగ్‌కు అనేక ఇతర నేరాలతో కూడా సంబంధం ఉందని పోలీసులు తేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CCTVNews  China News  CCTV Footage  politics  ghost  Yunnan  accident  China  police  

Other Articles