Cargo Plane Skids Off the Runway in Italy and Crashes Into a Nearby Road

Cargo plane crashes onto busy italian road after overshooting runway

italy, dhl cargo plane, plane skids off runway, italy plane crashes on road, cargo plane italy, plane slips on road, photos of plane on road italy, Bergamo’s Orio al Serio international airport, Boeing 737-400 crago plane, Paris Charles de Gaulle, Bergamo,

A cargo plane crashed into a road in Italy after overshooting the runway at Bergamo’s Orio al Serio international airport

ITEMVIDEOS: రన్ వే దాటి రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం..

Posted: 08/05/2016 02:39 PM IST
Cargo plane crashes onto busy italian road after overshooting runway

దుబాయ్ లో విమానం క్రాష్ ల్యాండింగ్ అయ్యి.. అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడి.. బతికిపోయాం దేవుడా అంటూ ఇంకా నిట్టూర్పినిడుస్తూన్న ఆ ఘటన మిగిల్చిన భాయానక దృశ్యాలను మరువక ముందే మరో విమాన ప్రమాద ఘటన ఇటలీలో వెలుగుచూసింది. ఓ విమానం రన్ వేను దాటుకుంటూ వచ్చి రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో అ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయకంపితులయ్యారు. తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే, పేలుడులాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737-400 అనే కార్గో విమానం తెల్లవారు జామున ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే క్రమంలో రన్ వేను దాటుకుంటూ నియంత్రణ కోల్పోయి రయ్మంటూ రోడ్డెక్కింది. ఈ ప్రమాదం జరగడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కొన్నిగంటలు మూసి వేసి అనంతరం తెరిచారు. ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మీడియా ప్రతినిధులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles