ఐసీయూలో సోనియా గాంధీ | Sonia Gandhi lands in ICU after UP rally

Sonia gandhi lands in icu after up rally

Congress president Sonia Gandhi, Sonia Gandhi lands in ICU, Sonia gandhi collapse, Sonia Gandhi in UP rally, Sonai gandhi injured, Sonia Gandhi In Varanasi Rally, sonia gandhi health

Congress president Sonia Gandhi, who was taken ill during a road show in Varanasi on Tuesday, was shifted to the intensive care unit (ICU) of Sir Ganga Ram hospital (SGRH) from the Army (Research and Referral) Hospital on Wednesday.

ఐసీయూలో సోనియా గాంధీ

Posted: 08/04/2016 09:03 AM IST
Sonia gandhi lands in icu after up rally

ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కాస్త ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వారణాసిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న సోనియా గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ప్రత్యేక విమానంలో ఆమెను చికిత్స కోసం తరలించిన సంగతి తెలిసిందే. ముందుగా ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు అక్కడ సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించకపోవటంతో హుటాహుటీన ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు.

కాగా, బుధవారం సాయంత్రం ఆరోగ్య స్థితి కాస్త దిగజారినట్లు కనిపించటంతో ఐసీయూ కి తరలించి చికిత్సను కొనసాగిస్తున్నారు. డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్‌ ల అసమతౌల్యంతో ఆమె బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ర్యాలీలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె కిందపడగా, మోచేయి విరిగినట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చే సమయంలో సరిగ్గా మాటలు కూడా రాలేదు. అపస్మారక స్థితిలో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.

ప్రముఖ పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని బృందం ఆమెకు వైద్య సేవలందిస్తున్నారంట. ఆమె పరిస్థితిపై వైద్యులు స్పష్టత ఇవ్వకపోటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తనయుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిత్యం కనిపెట్టుకుని ఉంటుండగా, కూతురు ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రా మధ్యలో వచ్చి చూసి వెళ్లారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  president  Sonia Gandhi  ICU  UP  Varanasi  rally  collapse  injure  

Other Articles