ప్రత్యేక హోదాపై బాలయ్య ఏమంటాడో మరి! balayya response on AP special status

Balayya response on ap special status

Bala krishna response on AP special Status, Balayya don't know any thing status, AP special status balayya response

Actor cum Politician Bala krishna response on AP special Status.

ITEMVIDEOS:హోదాపై బాలయ్యకు అసలు ఏం తెలుసు?

Posted: 08/02/2016 01:47 PM IST
Balayya response on ap special status

ఓవైపు ప్రత్యేక హోదా అంశం ఏపీతోపాటు, రాజధాని హస్తినను షేక్ చేస్తుంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏం జరగబోతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ఇంత సీరియస్ ఇష్యూపై తనకు ఏ మాత్రం అవగాహాన లేదని టీడీపీకి చెందిన ఓ కీలక నేత అప్పట్లో చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయి. ఆయన ఎవరో కాదు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.

తెలుగు దేశం అధినేత వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు, ప్రస్తుత అధినేత, ఏపీ సీఎం వియ్యంకుడు అయి ఉండి, పైగా రాజకీయం బ్లడ్ లోనే ఉందంటూ భారీ డైలాగ్ కొట్టే బాలయ్య నోట ఇలాంటి మాట వస్తుందని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరేమో. ఏడాది క్రితం ప్రత్యేక హోదాపై చర్చ తెరకు వచ్చిన సందర్భంలో మీడియాకు ఆయన ఏం చెప్పాడో గమనిస్తే కాస్త ఆశ్చర్యం కలగక మానదు.

 

ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందా అని ప్రశ్నించిన మీడియాతో సింపుల్ గా అసలు ఈ విషయంలో నాకు ఎంత మాత్రం అవగాహన లేదని బాలయ్య ఓపెన్ గా చెప్పేశాడు. అసలు ప్రత్యేక హోదా తో ఏం లాభాలు చేకూరుతాయి, లేకపోతే నిధులతోనే ఎక్కువ లాభాలు ఉంటాయా? తదితర అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. బీజేపీ మిత్రపక్షం కదా అని అడగ్గా... ఎట్టి పరిస్థితులల్లో హోదా దక్కితీరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇది జరిగి ఏడాది గడుస్తుంది. ప్రస్తుతం ప్రత్యేక హోదాపై బీజేపీ వ్యవహార శైలి, టీడీపీ పొత్తుపై విమర్శలు వినవస్తున్నాయి. ఈ సమయంలో బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేసుకుంటున్నాయి మీడియా చానెళ్లు. మరి బాలయ్య ఇప్పుడు ఏం చెబుతాడో, కనీసం ఇప్పటికైనా హోదా దాని వల్ల లాభాల గురించి పూర్తిగా తెలుసుకుని ఉన్నాడంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindupur  TDP MLA  Balakrishna  AP special Status  

Other Articles