మాయవతి కంటే వేశ్య నయం | BJP vice president objectionable statement on Mayawati

Bjp vice president objectionable statement on mayawati

BJP vice president Dayashankar Singh, Dayashankar Singh objectionable, objectionable comments on Mayawati, Mayawati Dayashankar Singh, BJP leader comments on Mayawati

BJP vice president objectionable statement on Mayawati. compare with prostitute.

ITEMVIDEOS:మాయావతిపై అసభ్య పదజాలం వాడాడు

Posted: 07/20/2016 01:50 PM IST
Bjp vice president objectionable statement on mayawati

రాజకీయాల్లో దిగజారుడు వ్యాఖ్యలకు ఇది మరోక నిదర్శనం. బీఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అసభ్య పదజాలం వాడాడు. మంగళవారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మీడియా సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.

ఒళ్లు అమ్ముకునే వ్యభిచారిణి పని అంతా అయ్యాక డబ్బులు తీసుకుంటుంది. కానీ, మాయావతి అంతకంటే దారుణం. పార్టీ టికెట్లను ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటుంది. ఎవరైనా కోటి రూపాయలు ఇస్తానంటే వారికి సీటు అమ్మతుంది, ఆపై రెండు కోట్లు అంటే మొదటి వారిని కాదని రెండోవారికి అమ్మేస్తుంది. మూడు కోట్లు అంటే వారికి ప్రాధాన్యం ఇస్తుంది. మాయావతి కంటే వేశ్యలే నయం. కాన్షీరాం లాంటి మహానుభావుల పరువు తీసేందుకే ఆమె ఉంది అంటూ ఘాటుగా మాట్లాడాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నోటి కొచ్చినట్లు మాట్లాడిన ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బీఎస్పీ ప్రతినిధులు చెబుతున్నారు.

 

కాగా తనపై చేసిన వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. సింగ్‌ అసహనంతో అలా మాట్లాడుతున్నారని.. తమ పార్టీ బలోపేతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భాజపా జనరల్‌ సెక్రటరీగా ఉన్న దయాశంకర్‌ సింగ్‌ గత నెల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన విధాన సభ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇక పెద్ద ఎత్తున్న విమర్శలు రావటంతో యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ చివరకు క్షమాపణలు చెప్పారు. నోరు జారానని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పారు. మాయావతి అంటే గౌరవమని చెప్పిన ఆయన, ఇకపై మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ముస్లింలకు దూరంగా ఉన్న బీజేపీ, ఆయన వ్యాఖ్యలతో, అణగారిన వర్గాలకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని భావించి దయాశంకర్ సింగ్ పై వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు యూపీ బీజేపీ అధ్యక్షుడు మౌర్య కాసేపటి క్రితం ప్రకటన చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  BSP chief Mayawati  BJP  vice president  Dayashankar Singh  objectionable comments  

Other Articles