man killed in peoples attack after woman suspicious death

19 year old woman suspicious death leads to mans death

rape, gangrape, rape, gangrape, vishakapatnam, andhra pradesh, repalle, 19 yr old woman suspicious death, shiek maherunnessa, matlapudi, adavuladeevi, vemula sai, jonna pavan kumar, molestation, sexual harrasment, sexual assult, crime

A 19-year-old woman suspicious death lead villagers attack on two men, one man killed after they thought these men molested her.

యువతిపై లైంగికదాడి చేశారని..

Posted: 07/18/2016 07:28 AM IST
19 year old woman suspicious death leads to mans death

గ్రామానికి చెందిన ఓ యువతిపై లైంగికదాడి చేసి అమెను హత్య చేశారన్న అనుమానంతో గ్రామస్థులు ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి చితకబాదారు. యువతి అనుమానాస్పద మృతితో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆ యువకులపై పాల్పడిన దాడిలో ఒక యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలెంలో షేక్ మెహరున్నీసా కుటుంబం నివసిస్తోంది.ఆదివారం కుటుంబీకులు మట్లపూడిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమార్తె జాస్మిన్ (19) మాత్రం వెళ్లలేదు.

కాగా కాసేపటికి ఆ ఇంటి నుంచి అడవులదీవికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్‌కుమార్ బయటికి వచ్చారు. పొరిగింటికి వెళ్లి అక్కడున్న వృద్ధులతో జాస్మిన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటోందని చెప్పారు. దీంతో స్థానికులు వెళ్లి చూసేసరికి ఆమె అచేతనంగా పడి ఉంది. మంచంపై నెత్తుటి మరకలు, తెగిన బెల్టు ఉండడంతో ఆ యువకులే లైంగిక దాడికి యత్నించి చంపేశారని భావించిన స్థానికులు వారిని చెట్టుకు కట్టేసి చితకబాదారు.

అనుమానాస్పద యువతి మృతి చెందిన ఘటన, యువకులను చితకబాదిన గ్రామస్థుల విషయం తెలిసుకున్న రేపల్లె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకులను స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వారికి నచ్చజెప్పి యువకులను స్టేషన్‌కు తరలించారు. కాగా, నిందితుల్లో ఒకరైన వేముల శ్రీసాయి (18) ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో పోలీసులు అతడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వైద్యశాల సమీపంలో మృతి చెందినట్లు పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  vishakapatnam  andhra pradesh  adavuladeevi  19 yr old woman  crime  

Other Articles