Kashmir tense after Hizbul leader Burhan Wani's killing, Amarnath yatra suspended

Violence erupts in kashmir bjp office in kulgam attacked

tence, Kashmir valley, one killed, BJP office attacked, Hizbul Mujhaideen, Burhan Wani encounter,burhan muzaffar wani, hizbul mujahideen commander burhan, hizbul commander death, jk hizbul news, hizbul burhan, burhan dead, burhan killed, burhan wani j&k, burhan wani death, burhan wani encounter, latest india news

Curfew-like restrictions were imposed in parts of Kashmir, including Srinagar city, and Amarnath yatra suspended as authorities apprehended protests in the Valley,

అందోళనకారుల దాడులతో అట్టుడుకుతున్న కాశ్మీరం..

Posted: 07/09/2016 05:23 PM IST
Violence erupts in kashmir bjp office in kulgam attacked

జమ్మూకాశ్మీర్ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల కాల్పులతో దద్దరిల్లుతుంది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు, పోలీసుల వర్గాలు పరస్పర దాడుల, కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు.

బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్‌ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles