ఆల్ ఈజ్ వెల్ అంటున్న విజయ్ మాల్యా | Vijay Mallya says Life must go on at F1 press meet

Vijay mallya says life must go on at f1 press meet

All is Well for Vijay Mallya, Vijay Mallya British Grand Prix press meet, Vijay Mallya public appearance

Embattled Indian business tycoon Vijay Mallya made a rare public appearance in the United Kingdom as he attended the Free Practice sessions ahead of Sunday's British Grand Prix, in Silverstone.

ఆల్ ఈజ్ వెల్ అంటున్న విజయ్ మాల్యా

Posted: 07/09/2016 02:20 PM IST
Vijay mallya says life must go on at f1 press meet

‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్ లో లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. విందులు, వినోదాల కోసం గుట్టుచప్పుడు కాకుండా క్లబ్బులు, పబ్బులకు వచ్చి పోతున్నారు. రేర్ అప్పియరెన్స్ కాస్త రెగ్యురల్ గా మారిపోయింది. ఏకంగా అక్కడి భారత రాయబారి హాజరైన పుస్తకావిష్కరణకూ హాజరయ్యాడు. ఇక శుక్రవారం ఏకంగా ఓ ప్రెస్ మీట్ లోనే పాల్గొని షాక్ ఇచ్చాడు.

ఫార్ములా వన్ రేసుల్లో తన జట్టు ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్’లో తన జట్టు మంచి ప్రదర్శన ఇవ్వనుందని, ఈ దఫా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చిన మాల్యా... అంతా బాగానే ఉందని కూడా కామెంట్ చేశారు.

అయితే బహిరంగంగా తిరగడం కాస్తంత ఇబ్బందికర విషయమే అయినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ పాస్ పోర్ట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఊరంత తిరగడంపై విమర్శలు రాకముందే బీజేపీ రంగంలోకి దిగింది.

ఎలాగైనా సరే మాల్యాను వెనక్కి రప్పించి చట్టం ముందు దోషిగా నిలబెడతామని పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ పేర్కొన్నాడు. కాంగ్రెస్ చేసిన పాపమే విజయ్ మాల్యా. అధికారంలో ఉండగా ఎంపీని చేయటంతోపాటు, బ్యాంకులపై ఒత్తిడి చేసి మాల్యాకు రుణాలు కాంగ్రెస్ ఇప్పించింది. ఇప్పుడేం ప్రభుత్వం ఏం చేస్తోందని ఎదురు ప్రశ్నలు వేస్తోంది. సిగ్గు చేటు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  British Grand Prix  F1 race  London  Press meet  

Other Articles