TDP Ex-MLA Eeli Nani Arrested While Playing Cards

Tdp ex mla eeli nani arrested while playing cards

TDP Ex-MLA, Eeli Nani, arrested, Playing Cards, tdp leader, card playing, former mla eli nani arrested, begumpet, Haritha Bhavan, Venkata madhusudhan rao, task force police, panjagutta police station

Ex-MLA and Telugu Desam Party in-charge of Tadepalligudem Eeli Nani alias Venkata Madhusudhana Rao was arrested by city police while illegally playing cards.

పేకాట అడుతూ పట్టుబడ్డ టీడీపీ నేత.. రూ.5 లక్షలు స్వాధీనం

Posted: 07/03/2016 10:26 AM IST
Tdp ex mla eeli nani arrested while playing cards

హైదరాబాద్ నగరంలో ఏక్కడ చిన్న నేరం జరుగుతుందన్న సమాచారం అందుకున్నా.. పోలీసులు వెనువెంటనే స్పందిస్తున్నారు. నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టి.. నేరాల నియంత్రణకు నడుం చుడుతున్నారు. నగరంలో రిక్రియేషన్ క్లబ్ పేరిట మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఇల్లు గుల్ల చేసుకుంటున్నారన్న సమాచారంతో ప్రభుత్వ అదేశాల నేపథ్యంలో అవి ఎక్కడ ఏ రూపంలో జరిగినా వాటిపై కొరడా జుళిపిస్తున్నారు పోలీసులు. అయితే పేకాట శిభిరాలు అన్ని కూడా మూత పడినా.. పేకాట రాయుళ్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో పేకాట అడుతున్నారు.

తాజగా పేకాట ఆడుతూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అలియాస్ వెంకట మధుసూధనరావు పట్టుబడ్డారు. బేగంపేట హరితప్లాజాలో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఈలి నాని సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈలి నాని తాడేపల్లిగూడెం శాసనసభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP Ex-MLA  Eeli Nani  arrested  Playing Cards  

Other Articles