లైవ్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్యేను ఏం చేశారంటే... | AAP MLA Dinesh Mohaniya arrested in a press conference

Aap mla arrested in the middle of press conference

AAP MLA Dinesh Mohaniya, MLA Dinesh Mohaniya arrested, AAP MLA arrested in the middle of pressmeet, MLA arrested in a press conference, ప్రెస్ మీట్ లో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్, మీడియాతో మాట్లాడుతుండగానే ఎత్తుకెళ్లిపోయారు, లైవ్ లో ఎమ్మెల్యేను ఎత్తుకళ్లిన పోలీసులు, లైవ్ లో మాట్లాడుతుండగా ఎమ్మెల్యే, మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేను ఏం చేశారంటే..., తాజా వార్తలు, national news, political news, జాతీయ వార్తలు, రాజకీయాలు

AAP MLA Dinesh Mohaniya arrested in the middle of a press conference.

ITEMVIDEOS: లైవ్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్యేను ఏం చేశారంటే...

Posted: 06/25/2016 04:21 PM IST
Aap mla arrested in the middle of press conference

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన నోటికి పని చెప్పారు. శనివారం ఉదయం రాజధానిలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రెస్ మీట్ మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేయటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విషయం ఏంటంటే... ఆప్ కు చెందిన దినేశ్ మోహనియా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నీటి కొరతపై వినతి ఇచ్చేందుకు శుక్రవారం ఆయన  కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధుడితోపాటు పలువురు మహిళలు వస్తే, వారితో దినేశ్ దురుసుగా వ్యవహరించారు.

సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వారిని దినేశ్ తోసేయడమే కాకుండా వారిపై తిట్ల దండకం అందుకున్నారు. దీంతో షాక్ తిన్న బాధితులు నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నేటి ఉదయం దినేశ్ ను అరెస్ట్ చేసేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అయినా వెనక్కి తగ్గని పోలీసులు మీడియా సమావేశంలోకి చొచ్చుకువెళ్లారు.

మీడియాతో మాట్లాడటం పూర్తి కాకముందే దినేశ్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తమ వెంట తీసుకెళ్లారు. కాగా, దీనిపై అధికార ఆప్ తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనివెనక ఎవరున్నారో తెలుసంటూ పరోక్షంగా బీజేపీపైనే పడుతోంది. అయితే తమ డ్యూటీ తాము సక్రమంగా నిర్వహించామని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని పోలీసులు చెబుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP MLA  Dinesh Mohaniya  press conference  arrested  

Other Articles

Today on Telugu Wishesh