పాపులర్ పాప్ సింగర్ దారుణ హత్య | Christina Grimmie Dead After Being Shot at Orlando Concert

Christina grimmie dead after being shot at orlando concert

Christina Grimmie, pop singer, Christina Grimmie shot dead, Christina Grimmie fire, క్రిస్టినా గ్రిమ్మీ, పాప్ సింగర్ పై కాల్పులు, పాప్ సింగర్ హత్య, పాప్ సింగర్ కాల్చివేత, తెలుగువార్తలు, ఎంటర్ టైన్ మెంట్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news, entertainment

Christina Grimmie Dead After Being Shot at Orlando Concert.

పాపులర్ పాప్ సింగర్ దారుణ హత్య

Posted: 06/11/2016 02:53 PM IST
Christina grimmie dead after being shot at orlando concert

అమెరికన్‌ పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీ(22) దారుణ హత్యకు గురైంది. శుక్రవారం రాత్రి ఓర్లాండోలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపటంతో అక్కడికక్కడే మృతి చెందింది. టీవీ షో 'బి ఫోర్ యు ఎగ్జిట్' కి ఆమె ప్రదర్శన ఇచ్చింది. అది ముగిశాక ఆమెను ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారు. వారితో ముచ్చటిస్తూ ఆటోగ్రాఫ్ ఇస్తోన్న స‌మ‌యంలో ఓ దుండ‌గుడు ఆమెపై కాల్పులు జ‌రిపాడు.

అనంత‌రం త‌న‌ని తాను కాల్చుకొని చ‌నిపోయాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన క్రిస్టినా గ్రిమ్మీని ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేక‌పోయింది. ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. సుమారు 60 మంది వరకు పాల్గొన్న ఈ కార్యక్రమంలో గ్రిమ్మీని లక్ష్యంగా చేసుకొనే కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి గ్రిమ్మీకి తెలిసిన వ్యక్తేనా లేక ఆమెను అభిమానా అనే విషయం దృవీకరించాల్సి ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ది వాయిస్ ఆల్బమ్ తో పాపులర్ అయిన గ్రిమ్మీ ఆపై యూట్యూబ్‌ స్టార్‌ గా వెలుగొందింది. చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచిపోవటంతో పలువురు సెలబ్రిటీలు దిగ్బ్రాంతి వ్యక్తంచేస్తున్నారు.


బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Christina Grimmie  pop singer  Christina Grimmie shot dead  Christina Grimmie fire  

Other Articles