బీజేపీలో ఇందిర మనవడి పోస్టర్ కలకలం | Varun Gandhi Poster war over probable UP CM nominee

Varun gandhi poster war over probable up cm nominee

Varun Gandhi, BJP MP, sulthanpur MP, UP CM candidate, varungandhi poster, 2017 యూపీ ఎన్నికలు, వరుణ్ గాంధీ, యూపీ సీఎం అభ్యర్థి, వరుణ్ గాంధీ పోస్టర్లు, యూపీ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ, బీజేపీ , యూపీ బీజేపీ సీఎం అభ్యర్థి, latest news, political news, national news, telugu news

Varun Gandhi Poster war over probable UP CM nominee. Poster war over probable chief ministerial nominee for 2017 Assembly Elections in Uttar Pradesh have gained momentum in the wake of BJP’s national executive committee meeting scheduled to take place in Allahabad on June 12.

ITEMVIDEOS:బీజేపీలో ఇందిర మనవడి పోస్టర్ కలకలం

Posted: 06/11/2016 02:20 PM IST
Varun gandhi poster war over probable up cm nominee

దేశ రాజకీయాలకు సెమీఫైనల్స్ గా భావించే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ పార్టీలు దృష్టిని సారిస్తున్నాయి. కాంగ్రెస్ రాహుల్ ను పక్కనబెట్టి ప్రియాంకకు బాధ్యతలు అప్పజెప్పాలన్న యోచనలో ఉండగా, బీజేపీ కూడా రాజ్ నాథ్ ను బరిలోకి దింపుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే సొంత నేత చేస్తున్న ఆర్భాటంతో బీజేపీకి అక్కడ ముచ్చెమటలు పడుతున్నాయి.

ఇందిరాగాంధీ మరో మనవడు, బీజేపీ యువనేత, సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ పెద్దలకు షాకిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రధాన ప్రాంతాల్లో మోదీతో సమానంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటంతోపాటు, కింది స్థాయి నేతలతో సమావేశాలు జరుపుతున్నాడు. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి తానేనన్న సంకేతాలను పార్టీ అధిష్ఠానంకు పంపుతున్నాడు. కాగా, ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

సుల్తాన్ పూర్ వదిలి బయటకు రావొద్దని పార్టీ ఆదేశాలను బేఖాతరు చేసి మరీ వరుణ్ ప్రచారంలో పాల్గొనటంపై అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఓవైపు చర్చలు జరుగుతున్న సమయంలో అతని ప్రవర్తన సరైంది కాదంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సైతం అంసతృప్తితో ఉన్నట్లు సమాచారం. క్రమశిక్షణ చర్యలు లాంటి వాటికి దిగితే మాత్రం ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీతో పోటీలో దిగుతారని వరుణ్ అనుచరులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అలాంటి చర్యలకు బీజేపీ దిగకపోవచ్చనే తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Gandhi  BJP MP  sulthanpur MP  UP CM candidate  varungandhi poster  

Other Articles