కటిక దారిద్ర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు! | Jammu MLAs added in BPL category

Jammu mlas added in bpl category

Krishan Lal Bhagat, MLA Rashid, Jammu MLAs in BPL list, MLAs in BPL, దారిద్ర్యంలో జమ్ము ఎమ్మెల్యేలు, క్రిషన్ లాల్ భగత్, ఎమ్మెల్యే రషీద్, పేదరికంలో బీజేపీ ఎమ్మెల్యేలు, తాజావార్తలు, రాజకీయాలు, తెలుగువార్తలు, latest news, political news, telugu news

BJP legislator from Chamb in Akhnoor district Dr Krishan Lal Bhagat complained about his inclusion in the BPL category.MLA Langate Engineer Rashid also stood up and informed the lower House that his name has also been included in the BPL list. “I informed the deputy commissioner but no action followed against the official concerned,” Rashid said.

కటిక దారిద్ర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు!

Posted: 06/10/2016 05:23 PM IST
Jammu mlas added in bpl category

ఓవైపు భారత్ లో పేదరికం పెరిగిపోతుందని ఐక్యరాజ్యసమితి చెబుతుంటే, అలాంటిదేం లేదని కేవలం పేద ప్రజలు మాత్రమే ఉన్నారంటూ కొందరు నేతలు ఛలోక్తులు ప్రదర్శించడం చూశాం. అయితే ప్రజా సమస్యలపై నిజాయితీతో పోరాటం చేసే నేతలు వేళ్ల మీద ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న చాలా వరకు నేతలు లగ్జరీ లైఫ్ కి దూరంగా లేరన్నది నిజం. పేదరికం అనే పదానికి చాలా దూరంలో ఉండే నేతలు దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారంటే ఎవరైనా నమ్ముతారా? అది కూడా తిండికి లేని స్థితిలో... నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.

ఛాబ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ క్రిషన్ లాల్ భగత్,   లాంగేట్ ఎమ్మెల్యే రషీద్ లు కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారంట. తిండికి కూడా దికానా లేని స్థితిలో వీరిద్దరి ఉన్నారంటూ వారి పేర్లను బీపీఎల్(దారిద్ర్యపు రేఖ దిగువ) జాబితాలో చేర్చారు అక్కడి అధికార్లు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయా ఎమ్మెల్యేలు పౌర సరఫరాల శాఖ మంత్రి చౌదరీ జుల్ఫికర్ తోపాటు, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారంట. అసలు అధికారులేమనుకుంటున్నారు? మేం ఏమన్నా పేదవాళ్లమా? దరిద్ర్యపు బతుకు అనుభవిస్తున్నామా? మమల్ని బిచ్చగాళ్లుగా చూస్తున్నారా? అంటూ తెగ ఫీలయిపోయారు.  

పేదరికం అంటేనే ఈసడించుకునే ఈ నేతల పేర్లు పొరపాటున చేర్చినందుకు పాపం ఆయా అధికారులపై వేటుపడింది. కాగా, బీపీఎల్ జాబితాలో పేర్లు ఇలా తప్పులు దొర్లటం కొత్తేమీ కాదని స్పీకర్ కవిందర్ గుప్తా చెబుతున్నాడు. అయినా వారిపై వేటు ద్వారా మిగతావారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో ప్రతిపక్షాల విమర్శలతో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishan Lal Bhagat  MLA Rashid  Jammu MLAs in BPL  

Other Articles