తెలుగు క్లాసిక్ చిత్రం సువర్ణ సుందరి క్లైమాక్స్ గుర్తుందా? అంజలిదేవీ అసలు సీక్రెట్ చెప్పేయటంతో భర్త అయిన అక్కినేని శాపం కారణంగా క్రమంగా రాయిలా మారిపోతుంటాడు. కానీ, చివరకు తన కొడుకు ఇంధ్రలోకం నుంచి ఎత్తుకొచ్చిన కమలంతో మళ్లీ మాములుగా మారిపోతాడనుకోండి. కానీ, ఇక్కడ రాయిలా మారుతున్న ఒక బాలుడి శాపవిమోచనం కోసం ఇంద్రలోకం వెళ్లాల్సిన అవసరం మాత్రం రాలేదు.
నేపాల్ కి చెందిన రమేష్ అనే ఓ 11 ఏళ్ల చిన్నారి పుట్టుకతోనే ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. చర్మంపై పోర మందంగా మారడంతో ఇప్పుడతని స్టోన్ బాయ్ గా వ్యవహరిస్తున్నారు. పుట్టిన 15వ రోజు నుంచే శరీరంపై ఉన్న మాములు చర్మం ఊడిపోయి ఆ స్థానంలో దళసరి చర్మం రావటం ప్రారంభమైంది. వెరసి నల్లని శిలలాగా ఆ బాలుడు మారిపోతున్నాడు. దీని ద్వారా కదల్లేని స్థితి ఆ బాలుడిది. ఇలా 11 ఏళ్లుగా ఆ బాలుడు నరకం చవిచూస్తున్నాడు.
వైద్య పరిభాషలో దీన్ని ఇష్తియోసిస్ గా వ్యవహరిస్తారు. దీనికి చికిత్స ఉంది, కాకపోతే కొంచెం ఖరీదుతో కూడుకుంది. నెలకు మూడు వేలు సంపాదించే అతని తండ్రి పిల్లాడి విషయంలో ఏం చేయలేని పరిస్థితి. అయితే సోషల్ మీడియా పుణ్యమాని అతని ఫోటో వైరల్ కావటంతో పలువురు దాతలు కూడా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. సంజయ్ శ్రేష్ఠ అనే గాయకుడు ఓ కచెరీ ద్వారా లక్షా ముప్పై వేలు సంపాదించి ఆ బాలుడి తండ్రికి అందజేశాడు.
ఇంకోవైపు జాస్ స్టోన్ అనే బ్రిటీష్ గాయని బాలుడ్ని చికిత్సకు అవసరమయ్యే పూర్తి ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చిది. ఆమె అందించిన డబ్బుతో ఇప్పటికే రెండో దశ చికిత్స కూడా జరిగిపోయిందని వైద్యులు తెలిపారు. రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్ ఇచ్చి, కొన్ని రకాల మందులు, మాయిశ్చరైజర్ రాసి మృత చర్మాన్ని తీసేసినట్లు వివరించారు. ప్రస్తుతం కాస్త బాగా మాట్లాడగలుగుతున్నాడు. క్రమంగా నడుస్తాడని, తర్వాత మామూలు మనిషిగా కూడా మారుతాడని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరు నెలలో తమ బిడ్డ మాములు మనిషి అవుతాడని తెలిసిన తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. మరోవైపు ఇన్నాళ్లూ తనను చూసి భయపడ్డ తోటిపిల్లలు త్వరలో తనతో ఆడుకోబోతున్నారంటూ చిన్నారి రమేష్ ఆనందంతో కన్నీంటి పర్యంతమయ్యాడు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more