Former India pacer Karsan Ghavri suffers heart attack

Ghavri suffers mild heart attack

India Cricket Team, Karsan Devjibhai Ghavri, Team India, india, cricketer, pace bowlerCricket, latest Cricket news

Karsan Ghavri, former India pacer, suffered a heart attack. He has undergone angioplasty and doctors said his condition is stable.

గుండెపోటుతో అస్పత్రిలో చేరిన మాజీ క్రికెటర్

Posted: 06/06/2016 09:07 PM IST
Ghavri suffers mild heart attack

భారత మాజీ క్రికెటర్, టీమిండియాకు పేసర్ గా సేవలందించిన కర్సాన్ ఘావ్రీ అకస్మాత్తుగా గుండె పోటుకు గురయ్యారు. కర్సాన్ ఆకస్మికంగా గుండె పోటుకు లోను కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డా.పీవీ శెట్టి ధృవీకరించారు. గుండె పోటు వచ్చిన వెంటేనే కర్సాన్ను ఆస్పతికి తరలించి అత్యవసర చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.

కాగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు వైద్యులు ఏంజియోప్లాస్టీ చికిత్స చేసిన తరువాత కర్సాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వెస్ట్జోన్ అండర్ -19 జట్టుకు కోచ్ గా ఉన్న కర్సాన్..  1970-80 మధ్య కాలంలో భారత బౌలింగ్ దిగ్గజం కపిల్దేవ్తో కొత్త బంతిని పంచుకున్నారు. కర్సాన్ 39 టెస్టు మ్యాచ్లు, 19 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 109 వికెట్లు తీసిన కర్సాన్.. నాలుగు సార్లు ఐదేసి వికెట్లను సాధించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Karsan Ghavri  india  cricketer  pace bowler  

Other Articles