Telangana petrol tanker owners on strike from Sunday midnight

Petroleum truckers in telangana go on stir

petrol tanker owners srike, Telangana petroleum tanker owners, State government, LPG transportation, petrol,diesel,crude oil prices,rupee dollar,excise duty, petrol, diesel prices, rises, modi government, goldman sachs, Indian market, international barrel prices, dollar rate, crude oil

Petroleum dealers who also own oil tankers will join the strike from June 5. Until then, they will continue fuel supplies but tanker owners have threatened to stop these vehicles.

తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలపై వారి ప్రభావం

Posted: 05/30/2016 09:08 AM IST
Petroleum truckers in telangana go on stir

తెలంగాణ ప్రభుత్వం తీరును నిరసిస్తూ గత అర్థరాత్రి నుంచి పెట్రోలియం, ఎల్పీజీ ట్యాంకర్ల సమ్మె బాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై 14.5 వ్యాట్‌ను విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఆదివారం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో సుమారు మూడు గంటలపాటు జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి మూకుమ్మడిగా ట్యాంకర్లను నిలిపివేశారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా గల ప్రధాన ఆయిల్ కంపెనీల ఏడు టెర్మినల్స్‌లో సుమారు మూడు వేల ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఫలితంగా 1,564 బంకులకు పెట్రోల్ సరఫరా ఆగిపోయింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్(టీపీడీఏ) మద్దతు ప్రకటించినప్పటికీ జూన్ 5 తర్వాత తమ ట్యాంకర్లను రోడ్డుపై తీయకుండా పెట్రోలియం రవాణాను స్తంభింపచేస్తామని వెల్లడించింది. పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై వ్యాట్‌ను ఉపసంహరించే వరకు సమ్మె నిలిపివేసే ప్రసక్తే లేదని ప్రకటించింది.

ఈ సందర్భంగా ట్రక్స్ ఓనర్స్ అసొసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు కె.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్-ఉల్-హుస్సేన్ లు మాట్లాడుతూ.. ఎల్పీజీ రవాణాపై కూడా వ్యాట్ విధిస్తే.. తాము ఎలా మనగలమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వానికి అన్ని తెలిసి కూడా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాని పక్షంలో రానున్న రోజుల్లో తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, సమ్మె ప్రభావం రెండురోజుల వరకు ఉండదని, ఆ మేరకు స్టాక్ ఉందని పెట్రోలియం డీలర్ల సంఘం ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

కాగా మరో మూడు రోజుల్లో అత్యంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలపై కూడా పెట్రోలియం ట్రక్కు ఓనర్ల సమ్మె ప్రభావం పడనుంది. బుధవారం వరకు ట్యాంకు ఓనర్ల ప్రభావం అంతంత మాత్రంగా వున్నా.. ఆ తరువాత మాత్రం సరిగ్గా తెలంగాణ అవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్ రెండున మాత్రం ఇబ్బందులు ఎదురుకాక తప్పదని, దీంతో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం వేడుకల అట్టహాసానికి ఇబ్బందులు వాటిల్లే ప్రమాదముందని వార్తలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles