వెయిటింగ్ ప్రయాణికులకు పెద్ద ఊరట | Indian Railways to change few rules from July 1

Indian railways to change few rules from july 1

Indian Railways, rules amended, tatkal ticket, రైల్వే నిబంధనలు, తత్కాల్ టికెట్, వెయిటింగ్ లిస్ట్, railway news, latest news, political news, latest

Effective July 1, the Indian Railways will have many changes in its existing rules and regulations that will benefit millions of passengers. The main highlight of these changes are refund on Tatkal ticket, confirmed ticket facility for train passengers among others.

వెయిటింగ్ ప్రయాణికులకు పెద్ద ఊరట

Posted: 05/27/2016 03:48 PM IST
Indian railways to change few rules from july 1

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నెల రోజుల ముందు రిజర్వేషన్ చేసుకున్నా బెర్త్ లభించలేని పరిస్థితి నెలకొంది. చివరి నిమిషం దాకా ఊరించే వెయిటింగ్ లిస్ట్ పై ఊసురుమంటూ ఆశలు పెట్టుకుని వెయిట్ చేయాల్సిందే. కానీ, ఇకపై అలాంటి ఎదురు చూపులు అక్కర్లేదు. వెయిటింగ్ లిస్ట్ లోని ప్రయాణికులకు ఊరట కలిగించేలా రైల్వే శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. తత్కాల్ టికెట్ కాన్సిల్ చేసుకున్నా సరే 50శాతం నగదును వాపసు చేసేలా ఏర్పాటు చేసింది.

ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా వేరే రైలులో ప్రయాణించే వెసులు బాటును కల్పించింది. ఇందుకోసం వికల్ప్ పథకానికి కొన్ని మార్పులు చేసింది. రాజధాని ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూర్, సికింద్రాబాద్ మార్గాల్లో ప్రయాణించే వారు వారి వారి ఇష్టం మేరకు వేరే ట్రెయిన్ లలో కూడా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్లోచ్చు. అయితే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లకు ఇది వర్తించదు. అలాగే రిజర్వేషన్ బుకింగ్ వేళలో కూడా మార్పులు చేశారు. ఏసీ బుకింగ్ ఉదయం 10 నుంచి 11 వరకు, స్లీపర్ కోచ్ బుకింగ్ ఉదయం 11 నుంచి 12 వరకు మార్చారు. ప్రాంతీయ భాషల్లో కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. మారిన ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంతేకాదు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్లాట్ ఫాం, ఆన్ రిజర్వ్, సీజన్ టికెట్లు కౌంటర్ కి వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు చేయొచ్చు.  ప్రయోగాత్మకంగా నిజాముద్దీన్ స్టేషన్లో ఈ ప్రాజెక్టును అల్రెడీ ప్రారంభించారు కూడా.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  tatkal booking  latest news  

Other Articles