నా కుటుంబం కన్నా మీరే ఎక్కువ | chandra babu naidu full speech at tirupathi mahanadu

Chandra babu naidu full speech at tirupathi mahanadu

AP CM, chandra babu naidu, tirupathi mahanadu, తిరుపతి మహానాడు, చంద్రబాబు నాయుడు స్పీచ్, AP political news, political news, AP news, latest telugu news

chandra babu naidu inagruate tirupathi mahanadu and full speech.

నా కుటుంబం కన్నా మీరే ఎక్కువ

Posted: 05/27/2016 01:45 PM IST
Chandra babu naidu full speech at tirupathi mahanadu

టీడీపీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండగ మహానాడు అని తెలుగు దేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో కాసేటి క్రితం ప్రారంభమైన మహానాడు వేడుకలో ఆయన ప్రసంగించారు. పార్టీజెండా మోసిన కార్యకర్తలందరికీ పాదాభివందనం. మనం పండగలా జరుపుకునే ఈ వేడుకలో నేనూ ఓ సాధారణ కార్యకర్తనే అని చెప్పారు. తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన స్థాపించిన ఈ పార్టీ తన చేతుల మీద కొనసాగటం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. సొంత కుటుంబం కన్నా పార్టీ కోసం, కార్యకర్తలే ఎక్కువని, వారి సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.

హైదబాద్ ను ప్రపంచ పటంలో నిలిపిందే టీడీపీయే. దానిని ఆర్థిక నగరంగా, ఉద్యోగాలుకల్పించే నగరంగా తీర్చిందిద్దింది తన ప్రభుత్వమేనని గుర్తుచేసుకున్నారు.  2029 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తున్నానని, ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోనని చెప్పుకోచ్చారు. అందుబాటులో ఉండాలనే విజయవాడలో రాజధాని విజయవాడలో పెట్టామన్నారు. చరిత్రలో రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదేనని, రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. విద్యాపరంగా ముందుకు వెళితే చాలూ బ్రహ్మాండమైన అభివృద్ధి సాద్యమవుతుందన్నారు. త్వరలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించబోతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయటం ద్వారా సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. శైలం నుంచి కరువు ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లి తీరతామని ఉద్ఘాటించారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగేలా ప్రయత్నిస్తున్నాం. మరిన్ని పెట్టుబడుల కోసం త్వరలో విదేశాలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం పై ఉందని, అందుకోసం అహర్నిశలు కృషి చేస్తానని ప్రకటించారాయన.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  tirupathi mahanadu  CBN speech at nahanadu  mahanadu 2016  

Other Articles