కరుణను ముప్పుతిప్పలు పెట్టిందిగా.. | Jayalalitha troubls karunanidhi in Tamilnadu

Jayalalitha troubls karunanidhi in tamilnadu

Tamilnadu, Amma, Jayalalitha, karunanidhi, DMK, AIDMK, తమిళనాడు, కరుణానిధి, జయలలిత

Beating exit-poll predictions, Chief Minister Jayalalithaa's ADMK has retained power in Tamil Nadu. The victory is significant as no government has been voted back to power in the state since 1984. The voting trends also indicate that Jayalalithaa has not lost much of her popularity after the 2014 parliamentary poll.

ITEMVIDEOS: కరుణను ముప్పుతిప్పలు పెట్టిందిగా..

Posted: 05/20/2016 11:17 AM IST
Jayalalitha troubls karunanidhi in tamilnadu

తమిళనాడు ఎలక్షన్లలో జయలలిత 32 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశారు. ఓ పార్టీ, ఓ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం అనేది తమిళనాడు చరిత్రలోనే ఎన్నడూ లేదు. అలాంటిది జయలలిత మొదటిసారి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకొని అందరికి షాకిచ్చింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ అమ్మకు ప్రతికూలంగా వచ్చినా కానీ చివరకు వాటిని తలకిందులు చేస్తూ తమిళ ఓటరు అమ్మకు జై కొట్టాడు. అయితే తమిళనాడు ఓటరు అంతలా ఓటు ప్రభంజనాన్ని అమ్మవైపుకు తిప్పడాన్ని కరుణానిధి ఎలా ఎదుర్కొన్నాడు అని ఇండియా టుడే ఛానల్ ఓ వీడియోలొ కామెడీగా చూపించింది.

అందులో ప్రచారానికి బయలుదేరిన కరుణ, అతడి కొడుకుల కారు ట్రబుల్ వస్తుంది. దాంతో చమటలు పట్టిన కరుణ పక్కనే ఉన్న డ్రింకింగ్ వాటర్ బాటిల్ కోసం వెళతాడు. అక్కడ మాత్రం అమ్మ వాటర్ అని జయలలిత ఫోటోతో వాటర్ కనిపిస్తుంది దాంతో వాటిని పట్టించుకోడు. సరే పక్కనే టిఫిన్ చేద్దామనుకుంటే అమ్మ క్యాంటీన్ ఉంటుంది. దాంతో చిర్రెత్తుకు వస్తుంది. తర్వాత ఫార్మసీకి వెళ్లి మందులు తీసుకుంటే వాటి మీద కూడా అమ్మ బొమ్మ ఉంటుంది. సరే అని ఓ షెల్టర్ లో పడుకుంటే తిరిగే ఫ్యాన్ అమ్మ బొమ్మతో ఉంటుంది. బయట కనీసం బోండా తాగుదామని అనుకుంటే ఆఖరుకు వాటి మీద కూడా అమ్మ బొమ్మ ఉంటుంది. దాంతో కోపంతో ఆ బోండాంను సముద్రంలోకి విసిరేస్తాడు కరుణానిధి. దాంతో సముద్రం ఉప్పెనవుతుంది.. ఆ ఉప్పెనలో జయలలిత కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles