శోభనం రోజు రాత్రి ఆ పని చేసింది | She did that at her first night

She did that at her first night

First Night, Divorce, Marriage, Married Couple, శోభనం, శోభనం రాత్రి

A newly married couple took divorce for a silly reason. Bridegroom just caring about her messages not about bride.

శోభనం రోజు రాత్రి ఆ పని చేసింది

Posted: 05/18/2016 11:38 AM IST
She did that at her first night

పెళ్లి అనేది రెండు మనసుల, రెండు కుటుంబాల అందమైన కలయిక. దేవతలు స్వర్గంలో పెళ్లిళ్లను నిర్ణయిస్తారు అని అంటారు.. సరే ఆ స్వర్గం సంగతి అటుంచి కొంత మంది తమ కాపురాలను చేజేతులారా కూల్చుకుంటున్నారు. టెక్నాలజీ సహాయంతొ దూరంగా మనసులను, మనుషులను కలిపినా కానీ దగ్గరే ఉన్న వాళ్లను మాత్రం దూరం చేస్తోంది. టెక్నాలజీకి బాగా అడిక్ట్ అయిన వాళ్లకు బంధాల విలువ తెలియడం లేదు. తాజాగా ఓ అమ్మడు శోభనం రోజు చేసిన నిర్వాకానికి అందరూ బిత్తర పోయారు. ఇంతకీ అమ్మగారు ఏం చేశారో తెలుసా..?

ఓ జంటకు కొత్తగా పెళ్లైంది. పెళ్లి తర్వాత కావాల్సిన శోభనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభనం గదిలో నిజానికి సిగ్గుపడుతూ.. ఒకరిని ఒకరు మరిచిపోవాల్సిన వాళ్లు చివరకు గొడవ పడి విడాకులు తీసుకున్నారు. ఇ:తకీ ఏం జరిగింది అంటే కొత్త పెళ్లి కూతురు శోభనం రోజు రాత్రి ఫోన్ లో మెసేజ్ లతో బిజీబిజీగా ఉంది. అదేంటి ఫోన్ పక్కనబెట్టు నాతో మాట్లాడు అంటే అమ్మడు పట్టించుకోలేదు. దానికి చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యక్తి నా కన్నా నీకు నీ ఫ్రెండ్సే ఎక్కువా అని అడిగాడు.. దానికి ఏ మాత్రం తడుముకోకుండా అమ్మడు అవును అని సమాధానమిచ్చింది. దాంతో ఆ భర్త వెంటనే తనకు విడాకులు కావాలని అడిగాడు. అమ్మాయి కూడా ఓకే అనడంతో చివరకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles