Centre can’t shirk responsibility while dealing with drought: Supreme Court

Indian supreme court censures federal states for ignoring drought

drought, supreme court, Justice Madan B Lokur, Justice N V Ramana, supreme court drought, dorught centre, centre drought , supreme court drought centre, centre drought supreme court, drought gujarat, drought haryana, bihar drought

The bench also issued directives for updating the drought management manual - published in 2009 — after taking into account rainfall deficit, timely declaration of drought and other factors.

నరేంద్రమోడీ సర్కారుపై సుప్రీంకోర్టు అక్షింతలు

Posted: 05/14/2016 10:01 AM IST
Indian supreme court censures federal states for ignoring drought

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అక్షింతలు పడడం పరిపాటిగా మారింది. అత్యున్నత న్యాయస్థానం తమపై మండిపడుతన్నా.. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం విఫలం అవుతుంది. దేశ వ్యాప్తంగా అలుముకుని వున్న కరుపు పరిస్థితులను పరిష్కరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సమంజసంగా లేవని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రంపై మండిపడిన విషయం తెలిసిందే.

అ విషయం మరువక ముందే కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధిహామీ కింద పనిచేసిన రైతులకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవటంపై సుప్రీం కోర్టు కేంద్రానికి అక్షింతలు వేసింది. ఈ పథకం కింద ఇవాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడింది. నిధులతో పాటు ఆలస్యానికి రోజుకు 0.05 శాతం చొప్పున పరిహారం అందించాలని  జస్టిస్ ఎంబీ లోకుర్, ఎన్వీ రమణల ధర్మాసనం ఆదేశించింది.

 నిధుల కొరత ఉందనే కారణంతో పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకోలేదని సుతిమెత్తగా  హెచ్చరించింది. జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)ప్రభావవంతంగా అమలు చేసేందుకు కమిషనర్లను నియమించుకోవాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు ఉపాధి హామీ చట్టంలో పేర్కొన్నట్లుగా కేంద్రీయ ఉద్యోగ ఉపాధి కౌన్సిల్‌ను ఏర్పాటుచేసుకుని కరువు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలని అదేశించింది.

ఇక దాంతో పాటుగా, కరువు పీడత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతన్న ప్రదేశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవంతా కొనసాగించాలని ఆదేశించింది. అయితే తన ఆదేశాల అమలుకు కోర్టు కమిషనర్‌ల నియామకానికి విముఖత తెలిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 1న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కరువుప్రాంతాల్లో ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవతీసుకోవాలని సూచించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Drought  Government  MNREGA  

Other Articles