Ashley Tisdale Went Braless and Had the Most Awkward Wardrobe Malfunction

Ashley tisdale s assets steal the show in see through top

Ashley Tisdale, Ashley Tisdale wardrobe malfunction, Ashley Tisdale nipple covers, ashley tisdale nipple pasties, nipple pasties, Celebrities & Entertainment, Ashley Tisdale, wardrobe malfunction, High School Musical", Ashley Tisdale Goes PINK, Ashley Tisdale Chats HSM, Ashley Tisdale New Boyfriend, Five Questions with Ashley Tisdale

ASHLEY Tisdale suffered a rather unfortunate wardrobe malfunction during her latest red carpet appearance.

ITEMVIDEOS: నిప్పల్ కవర్లు నటి పరువు నిండా తీశాయి

Posted: 04/28/2016 11:07 AM IST
Ashley tisdale s assets steal the show in see through top

అష్లీ టిస్ డేల్ అమెరికాకు చెందిన హాలీవుడ్ నటి. దాదాపుగా చిన్ననాటి నుంచే నటనారంగంలో రాణించింది. బాల్యంలోనే దాదాపుగా 100కు పైగా ప్రచార ప్రకటనల్లో రాణంచి.. అమెరికా ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుంది, ప్రస్తుతం అమె నటిగా, గాయినిగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. చిన్ననాటి నుంచి తన నటనాభినయంతో రాణించిన ఈ అమ్మడు.. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ రెడ్ కార్పెట్ కార్యక్రమానికి హాజరయ్యింది.

అందరిలా కాకుండా హైలైట్ గా నిలవాలని ఢిఫెరెంట్ గా ధింక్ చేసిన అమ్మడు అందరిలో అబాసుపాలైంది. ఎంతలా అంటే ఇక మరేం చేసేందుకు గత్యంతరం లేక తరువాతి రోజున తనకు తానుగా వివరణ ఇచ్చుకుంది.  అవి తనవి కాదని, తన కవర్లేనని చెప్పుకోచ్చింది, యావత్ ఘటనను ఒక సాధారణ ఘట్టంగా తీసుకుని పోయిన తన పరువును మళ్లీ తాను తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఎం జరిగింది..? అంతలా ఎలా అబాసుపాలైంది.. ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అష్లీ మిచ్చెలీ టిస్ డేల్ కి పలువురు సినీ, వ్యాపార, వాణిజ్య, టీవీ, రెడీయో కాళాకారుల తరహాలోనే గత నెలలో జరిగిన మధర్స్ డే రెడ్ కార్పెట్ ఈవెంట్ లో పాల్గోనేందుకు అహ్వానం అందింది. దీంతో తన స్టైలిష్ డిజైనర్ సహా తన కాస్టూమ్ అసిస్టెంట్ సూచనల మేరకు నల్లని దుస్తులను ధరించి అందరిలోకీ హైలైట్ గా నిలవాలని నిర్ణయించుకుంది ఈ ముఫై ఏళ్ల అమ్మడు, ముందుగా పల్చని చోకర్ ధరించి దానిపై లెధర్ జాకెట్ ధరించింది. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే వుంది అసలు ట్విస్టు.

ఈ కార్యక్రమానికి బ్రా లేకుండా వెళ్లాలని నిర్ణయించుకున్న అష్టీ.. కేవలం వక్షోజాల పై నిప్పల్ కవర్స్ అదే నిప్పల్ పెటల్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా ఇవి శరీరవర్ణంలో ఇమిడిపోవడం వల్ల బ్రా ధరించకపోయినా.. అసలేమీ కనబడదన్నమాట. అయితే అలా అనుకుని అష్టీ వేసుకున్న నిప్పల్ కవర్లు మాత్రం కెమెరా ఫ్లాష్ లైట్లు పడగానే మొత్తం తన శరీర అకృతి కనిపించడంతో పాటు తన వక్షోజాలు, వాటిపై వున్న నిప్పల్ పెటల్స్ కనిపించాయి. నిప్పల్ పెటెల్స్ మరింత నల్లని వర్ణంతో అమె నిప్పల్స్ అన్నట్లుగా కనిపించేసరికి మీడియా కెమెరాలు ఆ దృశ్యాలను క్యాచ్ చేసి కథనాలను ప్రచురించాయి.

దీంతో గత్యంతరం లేక, తనకు తాను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అష్టీకి. అవి తన నిప్పెల్ కవర్లని, అవి ధరించినా అలా కనిపించడంతో తాను అబాసుపాలయ్యానని పేర్కోంది, ఫ్రీ ద నిప్పల్ కవర్స్ అంటూ మొత్తం వివరణను లైట్ తీసుకున్నట్లుగా హ్యస్యాన్ని  జోడించింది. తన కాస్టూమ్ అసిస్టెంట్ వద్దని వారించినా  తాను ఆలా రావడం వల్ల తాను అబాసుపాలు కావాల్సి వచ్చిందని అసలు విషయాన్ని చెప్సింది. కుక్క తోక వంకర అన్నట్లుగా సెలబ్రిటీలకు అబాసుపాలు కావడం, మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashley Tisdale  wardrobe malfunction  nipple covers  nipple pasties  

Other Articles