dont spread superstions on 'Mini pink Moon' Spotted on Friday says scientists

Moon seen smallest in size on april 22

Moon, full moon, mini moon, pink moon, superstitions, scientists, science and technology, moon close to its apogee, moon 384,000 km away from the earth, moon farthest point from the earth, Debiprosad Duari, Director of M P Birla Planetarium, Kolkata

The moon appeared to be smaller in size on full moon day, the scientist appeal people not to belive any kind of superstitions on pink moon

ITEMVIDEOS: గులాభి వర్ణం చంద్రుడిపై వదంతులను నమ్మకండీ..!

Posted: 04/23/2016 01:04 PM IST
Moon seen smallest in size on april 22

పౌర్ణమి చంద్రుడిని చూడగానే కవుల నుంచి ప్రేమికుల వరకు అంతెందుకు కళాత్మక దృష్టి వున్న నిరక్షరాస్యుల వరకు ఎందరో ఎన్నోన్నో విధాలుగా పరవశం పోందుతారు. అంతటితో అగకుండా మరెన్నో విధాల పాటలు, కవితలు పాడుతుంటారు. వర్ణనలు చేస్తుంటారు. తమ వారితో పోలిస్తుంటారు. అది పౌర్ణమి చంద్రుడికి వున్న ప్రత్యేకత. అయితే గత రాత్రి కూడా పౌర్ణమేగా, పౌర్ణమి చంద్రుడిని సరదాగా చూస్తు గడుపుదాం అనుకున్న వాళ్ల ఆశలు అడియాశలయ్యాయి. ఎందుకంటారా..?

గత రాత్రి పౌర్ణమి అయినప్పటికీ చంద్రుడు మామూలు పరిమాణం కన్నా చిన్నగా కనిపించాడు. అదేంటి..? ఎందుకలా..? మామూలుగా కన్న చిన్న పరిమాణంలో చంద్రుడు ఎందుకు కనిపించాడు.? అ చిన్న చంద్రుడి పేరు మినీ మూన్. ప్రతీ 15 ఏళ్లకోసారి పౌర్ణమి నాడు చంద్రుడు తన పరిమాణాం కన్నా చిన్నగా కనిస్తుంటాడు. ఈ మేరకు కోల్‌కతాలోని బిర్లా ప్లానెటోరియం డెరైక్టర్ దేవీ ప్రసాద్ దురై వివరాలను తెలిపారు. సాధారణంగా భూమికి 3,84,000 కి.మీ. దూరంలో చంద్రుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. కానీ శుక్రవారం ఈ దూరం 4,06,350 కి.మీ.కు చేరటం వల్ల చిన్నగా కనబడితుందని దురై తెలిపారు. రాత్రి పాక్షికంగా చిన్న చంద్రుడిని గుర్తించవచ్చన్నారు.

అయితే ఇదే సమయంలో చంద్రుడు గులాభి వర్ణంలో కనబడుతుంటారన్ని విషయమై అనేక వదంతులు వెల్లివిరుస్తున్నాయి, రాత్రి 11 గంటల నుంచి వేకువ జాముణ 3 గంటల వరకు చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. పలువురు జ్యోతిష్యులు గ్రహాలు కదులుతున్నాయని, తద్వారా చర్యల్లో భాగంగా చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని ప్రచారం చేస్తున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు, హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం పెంచుకునేందుకు, మూఢ విశ్వాసాలు పెంచేందుకు జ్యోతిష్యులు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వారు స్పష్టం చేశారు.

చంద్రుడు సాధారణంగా ఎప్పట్లా ఉంటాడని వారు తెలిపారు. అమెరికాలో ఏప్రిల్ మాసంలో వసంత రుతువు ప్రారంభమవుతుందని, దీని వల్ల అక్కడ చెర్రీస్ వంటి గులాబీ రంగు పుష్పాలు విచ్చుకుంటాయని, అలా వచ్చే తొలి పూర్ణిమ కావడంతో దీనికి పింక్ మూన్ అని పేరు వచ్చిందని వారు వెల్లడించారు. రుతువు మారుతుంది తప్ప చంద్రుడు గులాబీ రంగులో దర్శనమిస్తాడని అర్థం కాదని వారు స్పష్టం చేశారు. పిచ్చిపిచ్చి ప్రచారాలు మానాలని వారు హితవు పలికారు. ప్రజలు కూడా ఎలాంటి వదంతులు నమ్మకూడదని వారు సూచించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Moon  full moon  mini moon  pink moon  superstitions  scientists  

Other Articles