ఏపిలో రైల్వే జోన్ ఎందుకు కావాలంటే..? | Here the reason why AP need railway zone

Here the reason why ap need railway zone

Railway Zone, YSRCP, YSR Congress, Vishakapatnam, Amarnath, అమర్ నాథ్, విశాఖ, రైల్వే జోన్

Tweaking its strategy in its fight for a separate railway zone at Visakhapatnam, the district YSRC unit has decided to seek the co-operation of other parties, including the Congress, CPI, CPM and other like-minded groups, ahead of its indefinite hunger strike from April 14.

ఏపిలో రైల్వే జోన్ ఎందుకు కావాలంటే..?

Posted: 04/18/2016 04:37 PM IST
Here the reason why ap need railway zone

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రాజకీయంగా ప్రస్తుతానికి ఎదురులేదని అనిపిస్తున్నా కానీ ఏపిలో ఆయన మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత నివురుగప్పిన నీరులా ఉంది అన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చాలా వైఫల్యాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తారు అని అనుకుంటుంటే ఆయన తెలిసి చేస్తున్న కొన్ని తప్పులు, ఆయనకు తెలియకుండా జరుగుతున్న తప్పుల ఫలితంగా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ల దగ్గరి నుండి నిన్నటి అమర్ నాధ్ దీక్ష వరకు ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను ధాటిగా ప్రశ్నించగలిగిన వైసీపీ పార్టీ దాన్ని ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్లలేకపోతోంది. ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలను చెప్పలేకపోతున్నారు. ఐతే చంద్రబాబు నాయుడుకు వ్యతిరే్కంగా మాట్లాడే సత్తా ఉన్న నాయకులు మాత్రం వైసీపీలో దండిగా ఉన్నారు జగన్ నుండి రోజా, నానిలతో పాటు ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ లు కూడా సిద్దంగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ది అంశం పక్కన బెట్టి చంద్రబాబు చేస్తున్న దుబారా గురించి నిలదీస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకు వైసీపీ అంటే దడ పుడుతోంది.

Also Read: అమర్ నాధ్ దీక్ష భగ్నం

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్న కేంద్రప్రభుత్వానికి, కేంద్రం ముక్క పిండలని నిస్సహాయ స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖజిల్లా వైసీపీ నాయకుడు గళమెత్తాడు. కేంద్ర ప్రభుత్వం నుండి విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటించేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే దీక్షకు దిగారు. దాంతో చంద్రబాబు నాయుడు బెంబేలెత్తారు. గతంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి వారు తగిన గుణపాఠం చెప్పారు. తాజాగా వైసీపీ నాయకుడు అమర్ నాధ్ దెబ్బ కూడా అలాగే ఉంటుందని ముందుగానే చంద్రబాబు ఊహించారు.

చంద్రబాబు నాయుడు తన సిక్త్స్ సెన్స్ ను వాడి మరీ అమర్ నాథ్ కు పెరుగుతున్న ఆదరణను పసిగట్టారు. అందుకే రాత్రి రాత్రి అమర్ నాధ్ దీక్షను పోలీసుల ప్రయోగంతో భగ్నం చేశారు. గత గురువారం నుండి నిన్నటి దాకా దాదాపుగా నాలుగు రోజుల పాటు సాగిన దీక్షకు ప్రజల నుండి భారీగా మద్దతు లభించింది. చాప కింద నీరులా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వల్లో లేదంటే విశాఖ జిల్లాలో రైల్వే జోన్ అనో కానీ ప్రజలు పోరాడేందుకు మాత్రం సిద్దంగా ఉన్నారు.

Also Read: క్షమాపణలు చెప్పిన రోజా

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను పసిగట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముందున్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకు భారీగా మెజారిటీ ఉన్నా కానీ అసెంబ్లీలో చమటలు పట్టిస్తున్నారు. ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు సర్కార్ కుదేలవుతున్నారు. అందుకే వాటి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా చంద్రబాబు నాయుడు గత రెండేళ్ల నుండి ఏపి కొసం ఎన్ని నిధులు రాబట్టగలిగారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తే ప్రతిపక్షాలు ఇంత గోల చెయ్యవు. కానీ ఆయన దగ్గర దానికి సమాధానం లేదు.

ఐదు రోజులుగా అమర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించలేదు. నిజానికి ఫలానా తేదీలోపు కచ్చితమైన ప్రకటన చేయాలని, లేకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని నెల రోజుల క్రితమే అమర్ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖ రాశారు. లేఖ రాసిన నెల రోజుల తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అంబేద్కర్ జయంతి రోజున అమర్ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఏపి ప్రభుత్వం చేస్తున్న నిర్వక్షం కారణంగా చివరకు రైల్వే జోన్ హామీ కూడా హామీగానే తప్ప ఆచరణగా మారడం లేదు. ఇంతకుముందు ఉన్న ఒకే రైల్వేజోన్ తెలంగాణకు వెళ్లిపోయింది.

నిజానికి ఏపికి రావాల్సిన జోన్ ఒడిశాలో ఉంది. జోన్ ఉన్నచోటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ఉంటుంది. మొన్న ఆర్ఆర్‌బీ పరీక్షలు నిర్వహిస్తే, మనవాళ్లు ఒడిషాకు వెళ్లినప్పుడు వీళ్లను రానివ్వకుండా తరిమికొట్టారుబిహార్‌లో రైల్వే జోన్ ఉంది.. మనవాళ్లు అక్కడకు పోయి ఉద్యోగాలు చేయరు. ఇదంతా తెలిసినా దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. ఒకసారి రైల్వేజోన్ వస్తే 16 హెచ్‌ఓడీలు వస్తారు. వాళ్లందరూ ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. జోన్‌కు సంబంధించిన రైల్వే లైన్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి వెళ్తాయి. కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా కూడా  ఒక జోన్ రావాలి

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles