Newspaper Reporter Listed The Worst Job - Again, Says Report

Newspaper reporter worst job of 2016

newspaper reporters, Newspapers, data scientist, best job, worst job, US Bureau of Labor Statistics, CareerCast, 200 jobs, four factors, reporter income, reporter environment, reporter stress, reporter outlook

For the third year in a row, the job of a newspaper reporter has been ranked as the worst profession, according to a survey which listed data scientist as the best job after a review of 200 careers.

వరస్ట్ జాబ్ గా రిపోర్టింగ్ హ్యాట్రిక్.. మరి రిపోర్టర్లు..

Posted: 04/18/2016 01:00 PM IST
Newspaper reporter worst job of 2016

వాళ్లు సత్యాన్వేష శోధకులు, మరోలా చెప్పాలంటే అనేక వాస్తవాలను బాహ్య ప్రపంచానికి అందించిన వాళ్లు. కలమే తమ ఆయుధంగా అనేక చీకటి సామ్రాజ్యంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకోచ్చిన వాళ్లు. రవి కాంచని అనేక సత్యాలను వాళ్లు శోధించి వెలుగులోకి తీసుకోచ్చారు. మరోలా చెప్పాలంటే ఎవరి భాధనైనా తమధిగా భావించేవాళ్లు, ఎవరి సమస్యనైనా తమదిగా సోంతం చేసుకునే వాళ్లు.. ఎవరి మాటల వెనుక అంతరార్థం ఏమిటో జగానికి చాటినవాళ్లు. వాళ్లే రిపోర్టర్లు. అదే నండీ ప్రతికా ప్రతినిధులు

యావత్ ప్రపంచంలోకెళ్లా అనేక కుంభకోణాలను వెలుగులోకి తీసుకోచ్చిన వారు రిపోర్టర్లు. ఫోర్ల్ ఎస్టేట్ గా రాజ్యాంగంలో స్థానం అక్రమించిన ప్రతికా రంగంలో క్షేత్రస్థాయికి వెళ్లి విషయాలను సత్యశోధన చేస్తూ,, ప్రతికారంగంలోనే కీలక భూమిక పోషించే వాళ్లే రిపోర్టర్లు. అలాంటి రిపోర్టర్లు ఇప్పుడు వరస్టా..? రిపోటింగ్ ఉద్యగమే వరస్టా..? అంటే అవుననే సమాధానమే లభిస్తుంది, ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సంస్థ జరిపిన సర్వేలలో బహిర్గతమైంది.

ఉద్యోగాల్లో బెస్ట్, వరస్ట్ జాబ్స్ ఏవో తెలుసుకునేందుకు జరిపిన సర్వేలో న్యూస్ పేపర్ రిపోర్టర్ చెత్త ఉద్యోగమని తేల్చారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని బెస్ట్ జాబ్ గా గుర్తించారు. అమెరికాకు చెందిన జాబ్స్ వెబ్ సైట్ 'కెరీర్ కాస్ట్' 200 ఉద్యోగాలను సర్వే చేసి ఈ నిర్ధారణకు వచ్చింది. 28వ వార్షిక ఉద్యోగాల రేటింట్ రిపోర్ట్ ను 'కెరీర్ కాస్ట్' తాజాగా విడుదల చేసింది. పనివాతావరణం, ఆదాయం, దృష్టి కోణం, ఒత్తడి తదితర అంశాలను ఉద్యోగాలకు రేటింగ్ ఇచ్చింది.

ఇందులో న్యూస్ పేపర్ రిపోర్టర్ ఉద్యోగం వరుసగా మూడో ఏడాది చెత్త జాబ్ గా నిలిచింది. న్యూస్ పేపర్ రిపోర్టర్ వార్షిక వేతనం 37,200 డాలర్లుగా గుర్తించింది. దశాబద్ద కాలంగా ప్రింట్ మీడియా క్రేజ్ తగ్గుతూ వస్తోందని, ఈ ప్రభావం సిబ్బందిపై పడుతోందని సర్వే వెల్లడించింది. వాణిజ్య ప్రకటనల ఆదాయం బాగా తగ్గడం ప్రింట్ మీడియా కుంగుబాటు కారణమని తెలిపింది. పెస్ట్ కంట్రోల్ వర్కర్, ఫైర్ ఫైటర్, మిలటరీ సర్వీస్ లు వరస్ట్ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ ఎనలిస్ట్, ఆడియాలజిస్ట్, డయాగ్నస్టిక్ మెడికల్ సోనోగ్రాఫర్ బెస్ట్ జాబ్స్ లిస్టులో చోటు సంపాదించాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reporter  best job  worst job  data scientist  news papers  

Other Articles