Nana Patekar Makes A Valid Point On The Mumbai High Court's Order Of Shifting IPL Matches

Crime to be silent says nana patekar on maharashtras drought

Nana Patekar, Maharashtra, drought, victims, NGO, Marathwada Drought, Marathwada, Drought, Farmers, Farmer Suicides Pratyusha Banerjee, suicide, case, IPL, high court

Nana Patekar is one actor who has closely been working towards helping the Mahrashtra drought victims and their families, and without making a noise about it.

వాళ్లు యాచకులు కాదు.. అన్నదాతలు.. ఆదరించండీ: నానాపటేకర్

Posted: 04/15/2016 04:31 PM IST
Crime to be silent says nana patekar on maharashtras drought

ఆయన ఓక నటుడు. అసాధారణ నటుడు. తన వద్ద వున్నంతలో రైతులను అదుకునేందుకు తన వంతు సాయంతో కొంత ఆర్థిక సాయం అందిస్తుంటాడు. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు నిత్యం శ్రమిస్తుంటాడు, ఆత్మహత్యలే శరణ్యమనుకున్ని బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను అదుకోవడంలో నటనారంగం నుంచి ఎవరైన ముందున్నారా అంటే ఆయన ఒక్కడి పేరు మాత్రమే మనకు విపిస్తుంది, బాలీవుడ్ లో ఒకనాటి రోజుల్లో ఓ వెలుగు వెలిగిన నానా పటేకర్, తన చిత్రాలలో క్రాంతివీర్ తరహా డైలాగులే కాదు.. రైతులను అదుకోవడంతో తన చిత్తశుద్దిని కూడా ఎవరు శంఖించవద్దని చాటిచెప్పాడు, ఆయన నానా పటేకర్.

మరట్వాడాకు చెందిన ఆయన ప్రతీ ఏడాది రైతు కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నాడు. దేశ ప్రజలందరికీ పట్టెడన్నం పెడుతున్న రైతుకు కన్నీళ్లు వంటాయని, వారికి కష్టాలు కూడా అంతే అధికమని తెలుసుకున్న వ్యక్తి నానాపటేకర్. రైతులను మనస్సున్న మనుషులుగా చూసే నానాపాటేకర్ తాజాగా వారి కోసం పట్టణ, నగర ప్రజలను అర్థిస్తున్నారు. గత కొన్నేళ్లుగా దుర్భర జీవితాలను గడుపుతున్న రైతేులు పట్టణాలకు వలస వస్తున్నారని, అయితే వారిని యాచకులుగా చూడకుండా.. రైతులుగా చూడాలని, వారిని అదరించి అక్కున చేర్చుకోవాలని విన్నవించాడు.

అయన ఎమన్నారంటే అయన మాట్లల్లోనే.. 'మహారాష్ట్రలోని చాలా కుటుంబాలు సిటీలకు వలస క్యూలు కడుతున్నాయి. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. ఎవరైనా మీ కారు అద్దాలను తట్టి చేతులు జోడిస్తే వారిని భిక్షగాళ్లలాగా చూడకండి. వారంతా రైతులు, నిస్సహాయులు. వారికి ఆహారం, నీళ్లు కావాలి. టాయిలెట్లకు డబ్బు చెల్లించాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోండి' అని ఆయన చెప్పారు.

తమ చుట్టుపక్కల కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు చూసి కూడా గొంతెత్తి చెప్పకపోవడం కూడా నేరం అవుతుందని పటేకర్ అన్నారు. మహారాష్ట్ర కరువు పరిస్థితులపై మీడియాతో మాట్లాడుతూ పటేకర్ కంటతడి పెట్టారు. పేదరికం, కరువు పీడిత రైతులు, వ్యవసాయ సంక్షోభం గురించి కాస్తంత భావోద్వేగంగానే మాట్లాడే పటేకర్ ఈసారి మాత్రం మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితిపై, రైతులు అనుభవిస్తున్న బాధలపై తీవ్ర ఆవేదన చెందుతూ కళ్లు చెమర్చారు.

నీటి కరువు నేపథ్యంలో మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించకూడదని బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటనిస్తుందని, కరువును పారద్రోలుతుందని అనుకోనని, అయితే అది ఒక మంచి ముందడుగు అని చెప్పారు. 'వచ్చే రెండు నెలలు మరింత భయంకరంగా ఉండనున్నాయి. మనం ముందే తేరుకుని ఉంటే అసలు వాటర్ ట్రైన్ పంపించాల్సిన అవసరం ఉండేదికాదు. ప్రజలుగా మనం విఫలమయ్యాం. నాయకులుగా వారు విఫలమయ్యారు. అంతా ఇక్కడి పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. కానీ ఎవరూ ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. రండి వ్యవస్థను ప్రశ్నించండి. అలా మౌనంగా ఉండటం పెద్ద నేరం' అని పటేకర్ చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Maharashtra  Nana Patekar  Crime  Silent  Drought  

Other Articles