set back to union mimister sujana chowdary

Sujana chowdary gets court reprieve

Arrest Warrent, NBW, union minister, sujana choudary, high court, Mauritius commercial Bank, nampally city court, set back, TDP, industralist sujana, Andhra Pradesh

Union Minister of State for Science and Technology Y S Chowdary alias Sujana Chowdary, who was facing arrest threat following a non-bailable warrant against him, got reprieve from the Hyderabad High Court

కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఎదురుదెబ్బ.. వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే..

Posted: 04/12/2016 04:42 PM IST
Sujana chowdary gets court reprieve

కేంద్రమంత్రి సుజనా చౌదరికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చెక్కెదరైంది. సుజనా చౌదరి వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. తనను వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ సుజనా హైకోర్టును ఆశ్రయించారు. తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని వారెంట్లు జారీ చేసిన నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు అదేశాలను సవాల్ చేస్తూ ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు,

సుజనా చౌదరి వేసిన పిటీషన్ విచారించిన హైకోర్టు ఆయన వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 26న నాంపల్లి కోర్టుకు సుజనా చౌదరి హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన వారెంట్ పై హైకోర్టు సడలింపు ఇస్తూ ...మే 5న ఆయన వ్యక్తిగతంగా  కోర్టు హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. కాగా మారిషస్ బ్యాంక్ కు రుణం ఎగవేత కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని, రుణం చెల్లించాలని కోర్టు మూడు సార్లు సమన్లు ఇచ్చినా సుజనా చౌదరి పట్టించుకోకపోవటంతో నాంపల్లి కోర్టు గురువారం సుజనా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles