big relief to daggubati suresh babu in high court

Major relief for daggubati suresh

Daggubati Suresh Babu, High Court, suspending, Justice G Chandraiah, Andhra Pradesh Film Chamber of Commerce, producer Suresbabu, Murali Mohan, High Court, city civil court,

In a major relief to top producer Daggubati Suresh Babu, the High Court stayed the city civil court order suspending him from serving as the president of Andhra Pradesh Film Chamber of Commerce.

హైకోర్టులో నిర్మాత దగ్గుబాటి సురేష్ కు ఊరట

Posted: 04/12/2016 10:18 AM IST
Major relief for daggubati suresh

ఫిలిం చాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్‌ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది. చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేశ్‌ బాబును నియంత్రిస్తూ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్‌ బాబు ఫిలిం చాంబర్‌కు బకాయిలున్నారని, అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని, అయినా కూడా పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పంపిణీదారుడు మురళీమోహన్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన సివిల్ కోర్టు, చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేష్‌బాబును నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు చాంబర్, ఇటు సురేశ్‌ బాబు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సురేష్‌బాబు ఎలాంటి బకాయిలు లేరని, నిబంధనల మేరకు ఎన్నికైన వ్యక్తిని బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Film Chamber president  producer Suresbabu  Murali Mohan  High Court  city civil court  

Other Articles