Indian doctoral student Devika Sirohi part of US team that determined Zika virus structure

Meerut girl part of us team that cracked zika structure

Zika Virus, Health, microcephaly, Devika Sirohi, Purdue University, Tata Institute of Fundamental Research (TIFR), Uttar Pradesh, Meerut

29-year-old Devika Sirohi from Uttar Pradesh is among the seven-member team of researchers that has successfully determined the structure of the Zika virus for the first time.

దేవిక సరోహీకి వెల్లువెత్తుతున్న ప్రశంసలు.. దేశం గర్వించే విజమని కితాబు

Posted: 04/06/2016 06:05 PM IST
Meerut girl part of us team that cracked zika structure

అత్యంత ప్రమాదకారిగా మారిన జికా వైరస్ ను ఎట్టకేలకు వైద్య పరిశోధకులు చేధించారు, భ్రూణహత్యలకు కారణమయ్యే ఈ వైరస్ తన ప్రభావాన్ని అత్యంత వేగంగా విస్తరించడంతో పాటు చాటుతుందని, ముఖ్యంగా గర్బిణీ స్త్రీల పాలిట ఇది యమపాశంలా తయారైందని ఆందోళన చెందిన వైద్య బృందం గత కొంతకాలంగా అనేక పరిశోధనలు సల్పుతూ ఎట్టకేలకు దాని గుట్టును కనుక్కోగలిగారు, అయితే ఈ బృందంలో భారతీయ వైద్యురాలు దేవికా సరోహి కూడా ఉండటం గమనార్హం, దీంతో అమెకు ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి,

‘‘దేవిక సిరోహి... మీకు అభినందనలు. మీరు మీ కుటుంబం మాత్రమే కాకుండా, యావత్తు దేశం గర్వపడే విజయం సాధించారు’’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. జీకా వైరస్‌ను విశ్లేషించిన అమెరికా బృందంలో మీరట్‌కు చెందిన దేవిక సిరోహి (29) సభ్యురాలు. జీకా వైరస్‌ను విశ్లేషించి, దాని నిర్మాణాన్ని వివరించడంలో ఈ బృందం విజయం సాధించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ దేవికను ప్రశంసించారు. మీరు సాధించిన విజయం వల్ల బాలికా విద్యకు ఉన్న ప్రాధాన్యం స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. బాలికలను రక్షించడంపైనా, బాలికలను చదివించడంపైనా మన దృష్టి ఉండాలన్నారు.
 
అయితే రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా దేశవ్యాప్తంగా అమెకు ప్రశంసలు అందుతున్నాయి, ముఖ్యంగా అమె క్లాస్ మెట్లు, మిత్రులతో పాటు ఉపాధ్యాయులు, పరిచయస్తులు అందరూ అమె సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు, జీకా వైరస్ నిర్మాణ క్రమాన్ని వివరించిన బృందంలో ఉన్న నలుగురు విద్యార్థుల్లో దేవిక ఒకరు. ఈ బృందం ఇచ్చిన వివరణ వల్ల జీకా వైరస్ ద్వారా వచ్చే వ్యాధికి చికిత్సను కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ప్రస్తుతం 38 దేశాల్లో వ్యాపించింది. దీని నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను ఇండియాతో సహా ఐదు దేశాలు చేపట్టాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles