Burglar Uses A Child’s Duvet To Hide His Identity As He Steals Money And Jewellery

Burglar ransacks house while hiding under a child s duvet

burglar robbing a home, burglar robbing a home in auckland, burglary, duvet, cctv, jewellery, cash, thief, auckland, caught, camera, robbery, New Zealand, Sergeant John Roberts, Manukau Police, CCTV footage

A burglar has come up with a novel way of disguising his appearance - by hiding under a child’s duvet.

ITEMVIDEOS: తెలివిగా దోచుకున్న దొంగ.. అతి తెలివితో బుక్కయ్యాడు

Posted: 04/04/2016 07:45 PM IST
Burglar ransacks house while hiding under a child s duvet

సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత దొంగలకు ఊపిరాడట్లేదేమో. గతంలో దొంగతనం చేస్తే కొన్ని రోజులపాటు ఆ దొంగ సొమ్మును అనుభవించే వరకు పోలీసులకు దొరికే వారు కాదు. కానీ, ఈ రోజుల్లో మాత్రం వారి పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. అలా దొంగతనం చేశారో లేదో ఇలా పట్టుబడిపోతున్నారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల పుణ్యమే. దీంతో ఇప్పుడు దొంగతనాలు చేయడానికి దొంగలు చిత్రవిచిత్రమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇంట్లో మనుషులకు భయపడకుండ సీసీటీవీ కెమెరా నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు.

అలానే న్యూజిలాండ్లోని డాన్నేమోరాలోల ఆక్లాండ్ నగరశివారు ప్రాంతంలో కూడా ఓ దోంగ తన తెలివితేటలతో దొంగతనానికి పాల్పడ్డారు, అయితే అతి తెలివి వల్ల కాబోలు చివరకు చిక్కాడు ఎలా చిక్కాడంటే. ఓ ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఓ దొంగ ఆ ఇల్లు మొత్తాన్ని దోచుకోవాలని అనుకున్నాడు. సీసీటీవీ కెమెరాకు ఎట్టి పరిస్థితుల్లో చిక్కకూడదని నిర్ణయించుకొని ఆ ఇంట్లో చిన్న పిల్లాడికి కప్పి దుప్పటి తీసుకొని తనకు కప్పుకున్నాడు. అనంతరం అచ్చం చిన్నపిల్లాడి మాదిరిగా మొకాళ్లపైనే ఇంట్లో పాకుతూ డబ్బు, నగలు దోచుకున్నాడు.

ఇంతవరకు బాగానే జాగ్రత్త పడిన దొంగ, దోరికినవన్నీ దోచుకుని ఇక బయటకు వెల్దామనుకున్నసమయంలో ఆయనను ఓ అనుమానం తొలిచింది, అంతే ఇంకేముంది అడ్డంగా బుకయ్యాడు, తాను ఆ ఇంట్లో వున్న సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నానా.? లేదా అన్న అనుమానం కలిగి.. కొంచెం దుప్పటి జరిపి దానివైపు చూశాడు. దాంతో అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఆధారంగానే అతడి ముఖాన్ని గుర్తించిన పోలీసులు ఫొటోను అన్ని చోట్ల అంటించి దయచేసి అతడి వివరాలు తెలిస్తే చెప్పండంటూ ప్రజలకు కోరారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : burglar  caught  camera  robbery  New Zealand  

Other Articles