Pratyusha Banerjee's death not suicide

Pratyusha banerjee s death not suicide

Pratyusha Banerjee, Rahul Singh, Balika Vadhu, Anandini

As more developments on Pratyusha Banerjee's sudden death come in, we have another latest report. The actress' body was shifted from Kokilaben hospital in Andheri to Siddharth hospital in Goregoan earlier in the day. The family has seen the body and the post mortem is under way...

చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదా..?

Posted: 04/02/2016 04:05 PM IST
Pratyusha banerjee s death not suicide

'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో ఎంతో బుల్లితెరపైకి వచ్చి ఫేమస్ అయిన  నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహాత్య చేసుకొన్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ తోటుచేసుకొంది.ఈ కేసులో కీలకమైమ ఆధారం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్‌సింగ్‌పై పలు అనుమానాలు కలుగుతున్నాయి.వీళ్లిద్దరు తాగి కొట్టుకునేవారని స్ధానికులు చెబుతున్నారు.ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.ఈ విషయాలన్ని బలపడేటట్లుగా ప్రత్యూష మరణం తర్వాత రాహుల్‌కి తొటి నటీనటులు  కాల్ చేసినా తను లిప్ట్ చేయటం లేదని తెలుస్తోంది.అయితే,అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది.

 ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనక బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందని  బంధువులు, తోటినటీనటులు అంటున్నారు.ప్రత్యూష సూసైడ్ నోట్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె ఏ విధమైన సూసైడ్ నోట్ రాయలేదనే మాట వినిపిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఆమె ఓ నోట్ రాసిందని అనధికార వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఆమె ఏం రాసిందనేది కూడా తెలియాల్సి ఉంది. ఆమె ఎవరి మీదనైనా అనుమానాలు వ్యక్తం చేసిందా అనేది తెలియాల్సి ఉంది. దానికి తోడు, అసలు ఆ నోటు ఆమెనే రాసిందా, ఆమె చేతి రాతతోనే ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. కాగా, రాహుల్ రాజ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అతని వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు సమాచారం.ఈ స్థితిలో పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు విషయం బయట పడేట్లు లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pratyusha Banerjee  Rahul Singh  Balika Vadhu  Anandini  

Other Articles