Xiaomi Mi 5 3GB+32GB storage version launched for India at Rs 24,999

Xiaomi mi 5 3gb 32gb storage version launched for india

xiaomi mi 5, smartphones, xiaomi mi 5 india launch, mi5, mi 5, xiaomi mi 5 specs, xiaomi mi 5 price, xiaomi mi 5 features, xiaomi mi 5 flagship smartphone, android, miui, tech news, technology

Xiaomi finally launched its 2016 flagship, Mi 5 at Rs 24,999 in India. The smartphone was first showcased at Mobile World Congress in Barcelona in three storage options.

భారతీయ విఫణిలోకి షియోమీ ఎంఐ.. మూడు వేరియంట్లలో లభ్యం

Posted: 04/01/2016 12:44 PM IST
Xiaomi mi 5 3gb 32gb storage version launched for india

గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురుచూస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ ను భారతీయ విఫణిలో ఆవిష్కరించింది షియోమీ సంస్థ. చైనా యాపిల్ సంస్థగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ ఇటీవల విడుదలైన యాపిల్ ఐ పోన్ ఎస్ ఈ ని ఢీకొనేందుకు సిద్దంగా వుంది. ఇప్పటి వరకు యాపిల్ సంస్థ నుంచి అత్యంత తక్కువగా చౌకధర ఫోన్ గా విడుదలైన ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలతో షియోమీ పోటీ ఇవ్వనుందని అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ధరలో కూడా ఈ రెండు బ్రాండ్‌లు రమారమి ఒకేలా వున్నాయి.

షియోమి ఫ్లాగ్ షిప్ పోన్ 24, వేల 999 రూపాయలుగా నిర్థారించారు. బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ తొలిసారిగా ఈ ఫోన్ లు ప్రదర్శించింది. అయితే ఈ ఫోన్ ను చైనాలో 1999 యోవన్ లు అంటే సుమారుగా 21 వేల రూపాయలకు దీనిని నిర్థారించగా, భారత్ సహా పలు దేశాలలో దీని ధర 25 వేలుగా నిర్థార్థించింది. అయితే ఈ ఫోన్ లు ఏప్రిల్ 6 నుంచి అమ్మకాలు సాగించనుంది. నలుపు, సువర్ణం, తెలుపు వర్ణాలలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్ సుమారుగా 129 గ్రాముల బరువుతో 7.25 మిల్లీమీటర్ల మందంతో వుంది.


షియోమీ ఎంఐ 5  స్పెసిఫికేషన్స్

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌, డ్యూయల్ సిమ్ ,  అలానే 5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, అయితే క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే తో ఈ ఫోన్ ల్యం కావడం లేదు. 4కె వీడియో రికార్డింగ్ , 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి.  ఐ ఫోన్ ఎస్ కంటే  తక్కువ బరువుతో  కేవలం 129 గ్రా. తూగే   ఈ షియామీ ఎమ్ఐ ధర 25000  రూపాయలు  ఉంటుదంని అంచాన. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు లాంచింగ్ అనంతరం వెల్లడి కానున్నాయి.

చైనా  తరువాత మొదటి మన ఇండియన్ మార్కెట్లలో  దీన్ని  మూడు వేరియంట్లలో  రిలీజ్ చేయనున్నారు. అయితే  మూడు వేరియంట్లను విడుదల చేసింది. 3జిబి రామ్ 32 జిబీ స్టోరేజ్ తో తొలి వేరియంట్ ను విడుదల చేసింది. ఇక రెండో వేరియంట్ 3జిబీ 64 జిబి స్టోరేజ్ తో అందుబాటు తీసుకురాగా, ఇక ఎంఐ 5 ప్రో అనే పేరుతో వచ్చిన మూడో వేరియంట్ 4 జిబి ర్యామ్ తో పాటు 128 జిబీ స్టోరేజ్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా భారతీయ విఫణిలోకి బేసిక్ వేరియంట్ మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  launch flagship smartphone Mi 5  3 variants  India  

Other Articles