Man drives away with cop on hood after traffic stop in China

Dramatic footage as traffic cop rides hood of escaping taxi

china, china accident, taxi driver, fake license, driving with a traffic police officer, police officer lying on the hood of the taxi, traffic camera, viral videos, traffic police, china police release video, tfafffic police footage

A taxi driver suspected of using a fake license plate in north China was filmed driving with a traffic police officer lying on the hood of the taxi.

ITEMVIDEOS: ట్రాఫిక్ పోలీసును ఢీకొని.. తప్పించుకునేందుకు యత్నం..

Posted: 03/29/2016 01:21 PM IST
Dramatic footage as traffic cop rides hood of escaping taxi

వేగంగా దూసుకోచ్చిన కారు.. స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో ఆగింది. అనుమానాం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు అక్కడ వాలిపోయారు. అయితే సినిమా స్టంట్ ల మాదిరిగా తన కారు ముందున్న ట్రాఫిక్ పోలీసును ఢీ కోన్న కారు.. అతన్ని అలాగే ముందరేసుకుని.. వేగంగా దూసుకెళ్లింది. అచ్చం సినిమాల్లో స్టంట్లా కనిపించే వాస్తవ సంఘటనకు చెందిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.  ఉత్తర చైనాలోని టియాజిన్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీసీకెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు.

వివరాలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దుండగుడిని ఇద్దరు పోలీసులు వెంబడించారు. గ్యాస్ బంకు దగ్గర ఆగడంతో అతన్ని లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించారు. అతని దగ్గర ఉన్నవి నకిలీ ధృవ పత్రాలు అని పోలీసులు నిర్ధారణకు వచ్చేలోపే దుండగుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారును ఆపాలని చూసిన ఓ పోలీసు అధికారి,  కారు ఢీకొట్టడంతో ముందు భాగం పై పడ్డాడు. అయినా కారును ఆపకుండా అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పై అతి వేగంగా పోనిచ్చాడు. ఈ మొత్తం తతంగం అక్కడే ఉన్న ట్రాఫిక్ సీసీ కెమరాల్లో చిక్కాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి  గాయాలతో పోలీసు అధికారి బయటపడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  china accident  taxi driver  fake license  traffic camera  viral videos  traffic police  

Other Articles