Jat reservation bill approved by Haryana Cabinet

Jat reservation bill approved by haryana cabinet

JAT, JAT Reservations, JAT community, haryana, Reservations

A day after Jat leaders threatened to resume their stir demanding for reservation, the Haryana Cabinet on Monday approved the Jat reservation bill and it will be soon tabled in the assembly.

జాట్ రిజర్వేషన్లకు కేబినెట్ ఓకే

Posted: 03/28/2016 01:44 PM IST
Jat reservation bill approved by haryana cabinet

ఎంతో కాలంగటా రాజుకుంటున్న జాట్ ల వివాదాలకు దాదాపుగా తెర పడిట్లే. వారు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న జాట్ రిజర్వేషన్లకు అక్కడి హర్యానా కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో  కేబినెట్ సమావేశమై  జాట్ కమ్యునిటీకి  రిజర్వేషన్లు కల్పించే బిల్లును  వచ్చే అసెంబ్లీ సెక్షన్ లో ప్రవేశపెట్టేందుకు వీలు కల్పిస్తూ ఆమోదించింది. జాట్ కమ్యునిటీకి  ప్రభుత్వోద్యోగాలు, విద్యాసంస్థల్లో  పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ  గత ఫిబ్రవరి నుంచి అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి  ఆందోళన చేస్తోంది.  

మార్చి నెలాఖరు లోగా  రిజర్వేషన్లను ఆమోదించని పక్షంలో  రిజర్వేషన్ల ఉద్యమాన్ని  మళ్లీ ప్రారంభిస్తామని ఆదివారం నాడే  హెచ్చరించింది.  ఈ రిజర్వేషన్ ఉద్యమం  హింసాత్మకంగా మారడంతో 30 మంది చనిపోయారు. చాలా ఆస్తినష్టం జరిగింది.  రోహాతక్,  జజ్జార్, ఖైఖాల్,  జింద్, సోనేపట్, భివాని  జిల్లాలు  ఆందోళనతో అట్టుడికాయి.  రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్న వారిపై పెట్టిన ఎఫ్ ఐ ఆర్ లు ఉపసంహరించాలని,  మృతుల కుటుంబాలకు,  ఆత్మాహుతికి పాల్పడిన వారి కుటుంబాలకు పరిహారం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JAT  JAT Reservations  JAT community  haryana  Reservations  

Other Articles