Were you offered money by AIADMK? MDMK's Vaiko storms out of TV interview when asked about funds

Angered by question vaiko storms out of interview

Vaiko,MDMK,Tamil Nadu Elections,Assembly Elections,Assembly Polls 2016,Assembly Polls Tamil Nadu, AIADMK, Chennai, Jayalalithaa, Tamil Nadu, Tamil Nadu Assembly Election 2016

MDMK leader Vaiko was seen walking out in a huff in the middle of a television interview when asked whether his party was offered a huge sum by Tamil Nadu's ruling AIADMK party.

ఆ ప్రశ్న అగిడినందుకు ఇంటర్వ్యూను నుంచి అర్థాంతరంగా వెళ్లిన నేత

Posted: 03/27/2016 11:31 AM IST
Angered by question vaiko storms out of interview

తమిళనాట ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూఎఫ్‌) సమన్వయకర్త, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కోపం వచ్చింది. పాలిమర్‌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైగో తీవ్ర అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా ఇంటర్వ్యూ మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ప్రజా సంక్షేమ కూటమిని అన్నాడీఎంకే బీ టీమ్‌ గా పిలవొచ్చా? అధికార పార్టీ నుంచి ఈ కూటమికి రూ.1500 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆయన 'నేను ఈ ఇంటర్వ్యూ రద్దు చేసుకుంటున్నాన'ని కాలర్‌ మైకును తీసేసి వెళ్లిపోయారు.

తన ప్రశ్న పూర్తిగా వినాలని ఛానల్‌ ప్రతినిధి కోరినా ఆయన వినిపించుకోలేదు. విజయ్ కాంత్ సీఎం అభ్యర్ధిగా డీఎండీకే, ఎండీఎంకే పొత్తుతో తమిళ ఎన్నికలకు వెళ్లనున్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలోనే వైగో డీఎంకే అధినేత కరుణానిధిపై సంచల వ్యాఖ్యాలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఈ రెండు పార్టీలు డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కు ఆఫర్ చేశాయని చెప్పారు. రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని డీఎంకే మధ్యవర్తిత్వం నడిపినట్లు వైగో ఆరోపించారు. కాగా, తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వైగోకు డీఎంకే అధినేత కరుణానిధి శనివారం నోటీసులు పంపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hrd ministry  hyderabad university  smriti irani  students  rohit vemula  

Other Articles