Ted Cruz | Donald Trump | Twitter fight | wives.| nude photos.| US presidential elections

Ted cruz and donald trump s monumentally stupid fight over their wives honor explained

Pulse, Ted Cruz, Donald Trump, cruz trump stupid fight, cruz trump fight over wives, honor, 2016 presidential election, politics, campaigns, wives nude photos campaign, US presidential elactions

Ted Cruz and Donald Trump have been embroiled in a heated Twitter fight for the past week over their wives.

నగ్న ఫోటోల ప్రచారంతో భార్యల పరువు తీసిన భర్తలు..

Posted: 03/26/2016 01:48 PM IST
Ted cruz and donald trump s monumentally stupid fight over their wives honor explained

రిపబ్లికన్ పార్టీలో అమెరికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారం రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటివరకు వ్యక్తిగత విమర్శలు, దూషణలకే పరిమితమైన ప్రత్యర్థులు రియల్ ఎస్టేట్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్, టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రుజ్ సంస్కారం పరిధి దాటి.. ప్రత్యర్థి భార్యపై అసహ్యకర ప్రచారానికి తెర లేపారు. అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ బరిలో నిలిచేందుకు సొంత పార్టీకి చెందిన వారే ఇలా ప్రత్యర్తుల తరహాలో తమ పరువును బజారు పాలు చేసుకుంటున్నారు.

అభ్యర్థుల గుణగణాలు, నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ఎలా ప్రగతిపథంలో నడిపిస్తాడన్న అంశాలను పరిగణలోకి తీసుకుని గతంలో ప్రచారాలు జరిగేవి. కానీ తాజాగా అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అత్యంత హేయకరమైన ప్రచారానికి కూడా తెరలేపారు. డోనాల్డ్ ట్రంప్ సతీమణి, మోడల్ మెలానియా 16 ఏళ్ల క్రితం ఓ మ్యాగజీన్ కు ఇచ్చిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో పెట్టి.. అయితే ఇకపై ఈమె మన ఫస్ట్ లేడీ అంటూ ఓ ప్రచార ప్రకటనను రూపోందించడం కాస్తా వివాదాస్పదంగా మారింది.

నడిరోడ్డుమీద తాను ఎవరినైనా కాల్చినా.. తనను అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ఎవరూ అడ్డుకోలేరు అన్న అహంకార ధీమాను వ్యక్తం చేసిన డోనాల్డ్ ట్రంప్.. తన సతి నగ్నఫోటోపై ప్రచార ప్రకటన చేయడంతో తన ప్రత్యర్థి టెడ్ క్రూజ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేనూ నీ భార్య సంగతి చూస్తానం’టూ బెదిరించారు. అనంతరం, తన భార్య మెలానియా, క్రుజ్ భార్య హైదీలను పోలుస్తూ వారి ఫొటోలను ట్వీటర్‌లో పోస్ట్ చేసి.. ‘ఒక్క ఫొటో వేయి పదాలతో సమానం’ అంటూ కామెంట్ రాశారు.

ఇది ఇద్దరి మధ్య అగ్గిని రాజేసింది. దీంతో డోనాల్డ్ ట్రంప్ ట్విట్ పై స్పందిచిన టెడ్ క్రూజ్ స్పందిస్తూ.. ‘నిజమైన పురుషులు స్త్రీలపై దాడి చేయరు. నీవు ఇంత పిరికివాడివనుకోలేదు. నీ భార్య చాలా అందంగా ఉంది. కానీ నా భార్యే నా జీవితం’ అంటూ క్రుజ్ స్పందించారు. మెలానియా నగ్న ఫొటో ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల ప్రచార తీరు దిగజారుడుతనంలో కొత్త లోతులకు చేరుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude photos. US presidential elections  donald trump  Ted cruz  

Other Articles