Javed Akhtar's hard-hitting reply to Asaduddin Owaisi

Javed akhtar s hard hitting reply to asaduddin owaisi

Javed Akthar, Asaduddin owisi, Bharath matha ki Jai, Parliament

Well-known poet and writer Javed Akhtar on Tuesday hit out at All India Majlis-e-Ittehadul Muslimeen party (AIMIM) leader Asaduddin Owaisi in Parliament. "He (Owaisi) said he will not say `Bharat mata ki jai` as the Constitution does not require him to say so. The Constitution even does not ask him to wear sherwani (dress) and topi (cap)... I don't care to know whether saying 'Bharat mata ki jai' is my duty or not, it is my right," Akhtar said amid thundering applause.

ITEMVIDEOS: భారత్ మాతాకి జై నిబంధన కాదు అధికారం

Posted: 03/16/2016 08:19 AM IST
Javed akhtar s hard hitting reply to asaduddin owaisi

ఒక పార్టీకి చెందిన ఎంపి 'భారత మాతా కి జై' అనమని రాజ్యంగం ఎక్కడ సూచించలేదని పెర్కోన్నాడని (అసదుద్దీన్ ఓవైసి ని ఉద్దేశించి), అది నిజమే రాజ్యంగంలో ఎక్కడ అలా రాసి లేదు కానీ భారత్ మాతా కి జై అనటం నా అధికారం అని రాజ్యసభ సభ్యుడు, రచయిత‌ జావేద్ అక్తర్ ఉద్ఘాటించారు. ఆయన 'భారత మాతా కి జై' అని నినాదాలు చేశారు, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సభ మొత్తం హర్షధ్వానాలతో నిండి పోయింది. రాజ్యసభలో పదవి విరమణ సంధర్భంగా జావేద్ అక్తర్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు.

ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* 'భారత్ మాతా కి జై' నిబంధన కాదు, అధికారం. అది రాజ్యంగంలో లేకుంటే టోపి పెట్టుకోవడం, సూటు బూటూ వేసుకోవడం కూడా రాజ్యంగంలో లేవు, ఆ పనులు ఎందుకు చేస్తున్నావు( ఒవైసీ పై విమర్శ).
'పాకీస్తాన్ ఛాలే జావ్' ఈ స్లోగన్ ఎక్కువ వినిపిస్తుంది, ఎమ్మెల్యేలు, ఎంపిలు మొదలుకొని కెబినెట్ మంత్రుల వరకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, వారిని అధికార పార్టీ నాయకులు అదుపులో పెట్టాలి.
* భారత్ లో సర్కార్, ప్రతిపక్షం ఉంటుంది, ఉండాలి కూడా. అదే మన ప్రజాస్వామ్య ప్రత్యేకత
* గ్రామాలలో అయినా, ఎక్కడైనా భారత్‍లోని యువకుల ఐక్యూ చాలా పవర్‍పుల్ గా ఉంటుంది. దేశాభివృద్ధికి దానిని ఉపయోగించాలి.
* నేను సభలోని అధికార, ప్రతిపక్ష నేతలయిన జైట్లీ, ఆజాద్ ల‌ ప్రసంగాలు విన్నాను.చిదంబరం, కపిల్ సిబల్ లాంటి వారు డిబేట్ చేస్తుంటే విన్నాను.
* బృందాకారత్, సీతారాం ఏచూరి ల లాజికల్, ప్రభావితమైన ప్రసంగాలు నన్ను ప్రభావితం చేశాయి.
* ప్రజాస్వామ్యం అంటే, మెజారిటీ వర్సెస్ మైనారిటీ కాదు, అన్ని వర్గాలను మెజారిటీ అయిన మైనారిటీ అయిన ఆ వర్గాలను గౌరవించడం.
* సెక్యులరిజం అనే విధానం మాత్రమే అన్ని వర్గాలను గౌరవిస్తుంది, దాని ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
* అభివృద్ధి అంటే, జిడిపి కాదు...హ్యుమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్. ప్రతి భారతీయుడి కడుపు నిండటం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Javed Akthar  Asaduddin owisi  Bharath matha ki Jai  Parliament  

Other Articles