Mother Teresa to be declared a saint September 4

Mother teresa to be declared a saint september 4

mothertherissa, Saint, Pope Francis, Mother Teresa

Mother Teresa, a nun who dedicated her life to helping the poor in India, will be canonized as a saint September 4, Pope Francis announced Tuesday. The date falls on the eve of the anniversary of her death, which occurred on September 5, 1997.

మదర్ ధెరిస్సాకు సెయింట్ హోదా

Posted: 03/16/2016 08:15 AM IST
Mother teresa to be declared a saint september 4

సేవకు ప్రతిరూపంగా నిలిచిన మానవతామూర్తి మదర్ థెరిసాకు సెయింట్ హోదా ఇచ్చేందు కు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం తెలిపారు. మదర్ థెరిసాను మహిమాన్వితుల జాబితాలో చేర్చేందుకు పోప్ సెప్టెంబర్ 4న ముహూర్తంగా ఖరారు చేశారని వాటికన్ నుంచి కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు సమాచారం అందింది. రోమ్ నగరంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించిన మదర్ థెరిసా 45 ఏళ్ల పాటు పేదలకు, రోగులకు, అనాథలకు సేవ చేస్తూ గడిపారు. అల్బేనియా దేశానికి చెందిన ఆమె తన 87వ ఏట 1997లో కన్నుమూశారు. మదర్ ధెరిసా ప్రమేయంతో జరిగిన రెండో అద్భుతాన్ని కూడా చర్చి గుర్తించిన తరువాత ఆమెకు సెయింట్ హోదా లభించేందుకు మార్గం సుమగమమైందని మిషనరీస్ ఆఫ్ చారిటీ తెలిపింది. ఈ సమాచారం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంస్థ ప్రతినిధి సునీతా కుమార్ అన్నారు.

మదర్ థెరిసాకు సెయింట్ లభించనున్న నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీన కోల్‌కతాలో భారీ ఎత్తున కృతజ్ఞత అర్పణ ఉత్సవాన్ని నిర్వహిస్తామని కోల్‌కతా ఆర్చ్‌బిషప్ థామస్ డిసూజా తెలిపారు. రోమ్‌నగరంలో 2003లో అప్పటి పోప్ జాన్‌పాల్ థెరిసాను పవిత్రమూర్తిగా ప్రకటించిన కార్యక్రమానికి మూడు లక్షల మంది హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి సంప్రదాయంలో ఓ వ్యక్తికి సెయింట్ హోదా ఇచ్చేందుకు వారు మరణించిన తరువాత వారి ప్రమేయంతో రెండు అద్భుతాలు జరగాలి. 1998లో జరిగిన మొదటి అద్భుతాన్ని వాటికన్ 2002లో గుర్తించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గిరిజన మహిళ కడుపులో కణితితో బాధ పడుతుండగా, ఆమెకు మదర్ థెరిసా మహిమతో స్వస్థత చేకూరింది. రెండో అద్భుతం బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. తలలో కణతులు ఉన్న ఓ వ్యక్తికి మదర్ జీవించి ఉన్నప్పుడు చేసిన ప్రార్థనల వల్ల నయమైనట్టు వాటికన్ గుర్తించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mothertherissa  Saint  Pope Francis  Mother Teresa  

Other Articles