Man uploads wife's nude pics, lands in jail

Software engineer posts her wifes nude photos on facebook

videos, social media, Kerala, KP Maneesh, dowry, software engineer, doury, nude photos, mangaluru,

In a horrific act, a software engineer(27) uploaded his wife's nude pics and videos on social media and also sent the CDs to her father. The techie, identified as K P Maneesh, has since been arrested by the police.

ఫేస్ బుక్ లో భార్య న్యూడ్ ఫోటోలు.. సాఫ్ట్ వేర్ ఇంజనీరు దాష్టికం..

Posted: 03/15/2016 01:15 PM IST
Software engineer posts her wifes nude photos on facebook

చదువుకుంటే ఉన్న మతి పోతుందని ఊరికే అనలేదు పెద్దలు. వాడు సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ కట్నం తీసుకోకుండా పెళ్లీ చేసుకోవాల్సిన వాడు.. కట్నం కోసం చేతులు చాచాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తాను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తరువాత కట్నం కోసం ఆశించడం, భార్యను వేధించడం, ఆమెకు పున్నామనరకం చూపించడాు. అత్తమామలను కూడా వదలలేదు. వారికి కూడా  ఫోన్లు చేసి కట్నం ఇస్తారా ఇవ్వరా అంటూ వేధించాడు.  అంతటితో ఆగకుండా కట్నం కోసం ఎవరూ చేయకూడని దాష్టికానికి పాల్పడ్డాడు.

కట్నం కోసం తను కట్టుకున్న భార్య నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడమే కాక ఆ చిత్రాలతో కూడిన సీడీని ఆమె తండ్రికి పంపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళూరు పరిధిలోని కాసరగోడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అతనికి  చేర్తళ(కేరళ)కు చెందిన 20 ఏళ్ల యువతితో ఫేస్‌బుక్ స్నేహం కుందిరింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఏడాది కిందట గురువాయూర్ దేవస్థానంలో వివాహం చేసుకున్నారు.

పెళ్లైన కొద్ది నెలలకే పుట్టింటినుంచి కట్నం తీసుకురావాలంటూ భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడా నీచుడు. వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో క్రూరంగా మారిపోయిన భర్త.. గతంలో భార్యకు తెలియకుండా తీసి భద్రపరుచుకున్న ఆమె నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాక ఆ ఫొటోల సీడీని యువతి తండ్రికి పంపాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాసరగోడు పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : software engineer  doury  nude photos  mangaluru  

Other Articles