PA Sangma dead; Lok Sabha adjourned in respect for former Speaker

Former lok sabha speaker pa sangma dies at 68

sangma, pa sangma, purno sangma, pa sangma dead, sangma dead, sangma obituary, former lok sabha speaker, former meghalaya chief minister, india news

PA Sangma, who was the Speaker of the Lok Sabha from 1996 to 1998, passed away after brief illness in Delhi on Friday.

మాజీ స్పీకర్ పి,ఏ సంగ్మా కన్నుమూత.. వాయిదా పడిన పార్లమెంటు

Posted: 03/04/2016 01:33 PM IST
Former lok sabha speaker pa sangma dies at 68

వివాదరహిత రాజకీయ నేత, లోక్ సభ మాజీ స్పీకర్, మేఘాలయ తురా నియోజకవర్గ ఎంపీ పీఏ సంగ్మా ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అరవై తొమ్మిదేళ్ల ఆయన ఇవాళ ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1988 నుంచి 1990 వరకూ మేఘాలయ ముఖ్యమంత్రిగా, 1996 నుంచి 1998 వరకూ 11వ లోక్ సభ స్పీకరుగా సేవలందించిన ఆయన, 1947 సెప్టెంబర్ 1న జన్మించారు. 8 సార్లు పార్లమెంటుకు ఎన్నికైయ్యారు.  సంగ్మా మరణవార్త తెలియగానే పార్లమెంటు ఉభయ సభలను వాయిదా వేశారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు, నేతలూ సంతాపం తెలిపారు.

సంగ్మా పూర్తిపేరు పూర్ణో అజితోక్ సంగ్మా. 1947, సెప్టెంబర్ 1న మేఘాలయా పశ్చిమ గారో పర్వత ప్రాంతంలోని ఛాపతి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు మరక్ సంగ్మా, చింగ్మీ సంగ్మా. షిల్లాంగ్ లోని ఆంటోనీ కాలేజీలో బీఏ(హానర్స్)  పూర్తిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. కాలేజీ చదువుల అనంతరం పూర్తికాలం రాజకీయనేతగా కెరీర్ ప్రారంభించిన సంగ్మా.. 1973లో మేఘాలయ యూత్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడయ్యారు. తర్వాతి ఏడాది ఆ విభాగానికి జనరల్ సెక్రటరీ అయ్యారు. 1975-1980 మధ్య కాలంలో మేఘాలయ పీసీసీ సెక్రటరీగా వ్యవహరించారు.

తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి 1977లో (6వ లోక్ సభకు) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సంగ్మా ఇప్పటికీ(14వ లోక్ సభ వరకు) ఎంపీగానే కొనసాగుతుండటం విశేషం. 1996 మే 25 నుంచి 1998 మార్చి 23 వరకు (11వ లోక్ సభకు) లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. కేంద్రమంత్రి వర్గంలోనూ పలు శాఖలు నిర్వహించిన సంగ్మా.. 1988 నుంచి 1990 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటుపై మళ్లీ కేంద్ర పదవులు చేపట్టారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై 1999లో తిరుగుబావుటా ఎగరేసిన పీఏ సంగ్మా.. శరద్ పవార్, తారీఖ్ అన్వర్ లతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటుచేశారు. అయితే 2011లో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవాలనుకున్న ఆయన నిర్ణయాన్ని ఎన్సీపీ సమర్థించకపోవడంతో ఆ పార్టీని వీడి సొంతగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ)ని స్థాపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీపై పోటీచేసి ఓటమిపాలయినప్పటికీ గిరిజన నేతగా ఆయన చేసిన రాజకీయపోరాటం చరిత్రలో నిలుస్తుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PA Sangma  passed away  new delhi  former loksabha speaker  meghalaya  

Other Articles