Posters of Hafiz Saeed with Modi in Amritsar

Posters of hafiz saeed with modi in amritsar

Modi, Amritsar, Punjab, Afzal guru, Haffez Sayed, Posters, rahul gandhi

THE COMPETING nationalism narrative, that has emerged between the Congress and the BJP following the JNU row, was at the heart of a poster war in Amritsar on Thursday. While the BJP put up a poster of the Pakistan-based Jamaat-ud-Dawa chief Hafeez Saeed and Rahul Gandhi, accusing the Congress vice-president of speaking the language of Pakistan, the Congress responded with a parallel poster of Prime Minister Narendra Modi featured with Afzal Guru, Hafiz Saeed and Peoples Democratic Party (PDP) leader Mehbooba Mufti, questioning the PM’s ‘patriotic’ credentials.

అప్ఘల్ గురు, హఫీజ్ సయిద్ లతో మోదీ..!

Posted: 02/26/2016 03:42 PM IST
Posters of hafiz saeed with modi in amritsar

భారత్ లో దేశభక్తి అంశం హాట్ టాపిక్ గా మారింది. దేశభక్తిలో మేం గొప్ప అంటే.. కాదు మేం గొప్ప అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నడుస్తున్న వివాదం కాస్తా ఇప్పుడు గోడల మీదకు ఎక్కింది. పంజాబ్ లో కనిపిస్తున్న పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్ తరఫున కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వకాల్తా పుచ్చుకున్నాడనే అర్థం వచ్చేలా.. ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, రాహుల్ గాంధీలు పక్కపక్కనే ఉన్నట్లు తయారు చేసిన పోస్టర్లను బీజేపీ కార్యకర్తలు అమృత్ సర్ లో అంటించారు.

దీని గురించి తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కౌంటర్ ఇచ్చాయి. హఫీజ్ సయీద్, ప్రధాని నరేంద్ర మోడీ పక్కపక్కనే ఉన్నట్లు పోస్టర్లు తయారు చేసి గోడలపై అంటించేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పార్లమెంటు దాడి సూత్రధారి అఫ్జల్ గురుకు అనుకూలంగా ర్యాలీతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో తాజా పోస్టర్లు నిప్పురాజేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Amritsar  Punjab  Afzal guru  Haffez Sayed  Posters  rahul gandhi  

Other Articles