Telangana TDP leader revanth reddy slam

Telangana tdp leader revanth reddy slam

TRS, Revanth Reddy, Errabelli Dayakar Rao, TDP, harish Rao, KTR

Telangana TDP leader revanth reddy slam. Errabelli He said that Errabelli will bifercate the TRS party

ITEMVIDEOS: టీఆర్ఎస్ ను చీల్చేది ఎర్రిబెల్లినే: రేవంత్

Posted: 02/26/2016 03:59 PM IST
Telangana tdp leader revanth reddy slam

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఉప్పు, కారం తిని కొందరు మరిచిపోయి మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం చూపిస్తుందని పార్టీ వీడిన వారిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వారిపై విరుసుకుపడ్డారు. నీతి, జాతి లేనివారు పోతే తెలంగాణలో టీడీపీకి వచ్చే నష్టమేమీలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. అంతేకాకుండా టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లు మాకు చచ్చినవాళ్లతో సమానమని ఎద్దేవ చేశారు. ఇటీవల టీడీపీ నుంచి వెళ్లిన దయాకర్ రావు చంద్రబాబును తెలంగాణలో చేతులెత్తారని విమర్శించిన మాట విదితమే. ఈ వ్యాఖ్యలకు ఉద్దేశించి రేవంత్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. చంద్రబాబు ఎడమచెయ్యి విదిల్చితే బతికిన దయాకర్‌రావు మతిలేక మాట్లాడుతున్నారని ఘటుగా విమర్మించారు.

కాగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం కలిగిస్తారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మొన్నటి దాకా దొంగచాటుగా సహకరించిన ఎర్రబెల్లి ఇప్పుడు బహిరంగంగా మిత్రులయ్యారని అన్నారు. అంతర్గతంగా హరీష్ రావు, కేటీఆర్ కు ఉన్న విభేదాలను మరింత పెంచుతారని.. ఏదో ఒక పక్కకు చేరి.. పార్టీని చీల్చడం ఖచ్చితం అని రేవంత్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Revanth Reddy  Errabelli Dayakar Rao  TDP  harish Rao  KTR  

Other Articles