Suresh Prabhu will present railway budget today

Suresh prabhu will present railway budget today

Railways, Railway Budget, Budget, Suresh Prabhu

Indian Railways will have to depend on more government support and borrowing to fix its finances in its budget on Thursday, with New Delhi reluctant to unveil steep fare hikes ahead of key state elections, officials said.

నేడే రైల్వే బడ్జెట్.. చార్జీల మోత ఉండకపోవచ్చు

Posted: 02/25/2016 09:21 AM IST
Suresh prabhu will present railway budget today

రైల్వే బడ్జెట్ కి టైం దగ్గర పడుతోంది.  లక్షా 25వేల కోట్ల రూపాయిల వ్యయంతో 2016-17 రైల్వే బడ్జెట్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.  ఛార్జీల మోత మాత్రం వద్దు సురేష్ ప్రభో అని సామాన్యుల విజ్ఞప్తి పెరుగుతోంది. పరిశుభ్రత, ప్రయాణికులకు భద్రత పెంచండి అంటూ ప్రయాణికులు మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సామాన్య ప్రయణికుల విన్నపాలను కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. ఏం చేయబోతున్నారన్న సస్పెన్స్ కొన్ని గంటల్లోనే ముగియనుంది.

నష్టాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైల్వే లాభాల బాట పట్టాలంటే.. ఈ సారి బడ్జెట్లో ఛార్జీలను పెంచాల్సిందేనని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభును కోరుతోంది. సరుకు రవాణాకు ప్రాధాన్యత పెంచడానికి బడ్జెట్-లో పెద్దపీట వేయాలని కోరుతున్న అసోచామ్.. ప్రయాణికుల ఛార్జీలు పెంపుతోనే అభివృద్ధి సాధ్యమని సూచిస్తోంది. అయితే లక్కీగా అసోచామ్ సూచనలను పక్కన పెట్టిన సురేష్ ప్రభూ.. 2016-17 రైల్వే బడ్జెట్ ఛార్జీల పెంపు అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే సంకేతాలు ఇస్తున్నారు . కాగా గత బడ్జెట్ లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ, రైలును కానీ కేటాయించలేదు.. మరి ఈ బడ్జెట్ కూడా సంస్థాగత నిర్మాణం కోసం ఉద్దేశించిందా లేదంటే జనాకర్షక బడ్జెట్ ఉంటుందా అని ఎదురు చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  Railway Budget  Budget  Suresh Prabhu  

Other Articles